Pasalapoodi Veerababu Review: రివ్యూ: పసలపూడి వీరబాబు
Pasalapoodi Veerababu: కార్తి, అదితి శంకర్ జంటగా నటించిన మాస్ ఎంటర్టైనర్ ‘పసలపూడి వీరబాబు’ ఎలా ఉందంటే?
చిత్రం: పసలపూడి వీరబాబు; నటీనటులు: కార్తి, అదితి శంకర్, రాజ్ కిరణ్, ప్రకాశ్ రాజ్, సూరి, శరణ్య, తదితరులు; సినిమాటోగ్రఫీ: ఎస్.కె. సెల్వకుమార్; ఎడిటింగ్: వెంకట్ రాజన్; సంగీతం: యువన్ శంకర్ రాజా; నిర్మాణ సంస్థ: 2డీ ఎంటర్టైన్మెంట్; నిర్మాతలు: సూర్య-జ్యోతిక; కథ, కథనం, దర్శకత్వం: ముత్తయ్య; స్ట్రీమింగ్: అమెజాన్ ప్రైమ్ వీడియో
తమిళంతో పాటు, తెలుగులోనూ మంచి క్రేజ్ ఉన్న నటుడు కార్తి (Karthi). ఆయన నటించిన ప్రతి సినిమా తెలుగులోనూ విడుదలవుతుంది. అయితే, ఆగస్టు 12న తమిళంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘విరుమన్’ (Viruman) తెలుగు వెర్షన్ మాత్రం విడుదల చేయలేదు. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ‘పసలపూడి వీరబాబు’ (Pasalapoodi Veerababu) గా ఈ సినిమా విడుదలైంది. మరి ఈ వీరబాబు కథేంటి?
కథేంటంటే: వీరబాబు(కార్తి)కి తండ్రి భూపతి(ప్రకాశ్‌రాజ్) అంటే పడదు. తన తల్లి చావుకు కారణం అతడేనంటూ చిన్నప్పుడే హత్యాయత్నం కూడా చేస్తాడు. కోర్టు తీర్పుతో మావయ్య (రాజ్‌కిరణ్) వద్ద పెరిగి పెద్దవాడవుతాడు. తన తల్లి గొప్పతనాన్ని తండ్రితో పాటు ముగ్గురు అన్నలకు తెలియజెప్పి, పశ్చాత్తాపం చెందేలా చేయాలనుకుంటాడు. అందుకు వీరబాబు ఏం చేశాడు? రేణుక (అదితి శంకర్) ఎవరు? చివరకు భూపతి ఎలా మనిషిగా మారాడు? అనేది సినిమాలో చూడాలి.
ఎలా ఉందంటే: తండ్రీ కొడుకుల మధ్య వైరం కథా నేపథ్యంతో ఇప్పటికే కొన్ని వందల సినిమాలు వచ్చాయి. ‘పసలపూడి వీరబాబు’ కూడా అలాంటి బాపతే. తండ్రిపై హత్యాయత్నం చేయడానికి వీరబాబు ప్రయత్నించడంతోనే సినిమా మొదలవుతుంది. మొదటి సన్నివేశంతోనే అసలు కథేంటో చెప్పేశాడు దర్శకుడు. దీనికి అన్నదమ్ముల సెంటిమెంట్, మధ్యలో ఊరి గొడవ, ఆ మధ్యలో లవ్ ట్రాక్. ప్రతి భాషలో అనేకసార్లు వాడి వాడి అరగదీసిన సబ్జెక్ట్‌ను తీసుకుని, దర్శకుడు ముత్తయ్య మళ్లీ తీశారంతే. ఒక్క సన్నివేశంలోనూ కొత్తదనం, ఆసక్తి, ఉత్కంఠ కనిపించదు. ఎమ్మార్వో అయిన తండ్రి పరువు తీయడానికి వీరబాబు విక్రమార్కుడిలా ప్రయత్నాలు చేయడమే సినిమా. దురాశపరుడైన తండ్రి ఛీకొట్టడంతో దూరమైన అన్నలను అక్కున చేర్చుకుంటూ ఉంటాడు. గతంలో కార్తి నటించిన ‘చినబాబు’ కూడా ఇలాగే సాగుతుంది. ఇక మధ్యలో హీరో ఎలివేషన్స్, ఫైట్స్, మాస్ డైలాగ్స్ అన్నీ కామన్. ప్రేక్షకుడికి ఒకేఒక్క ఉపశమనం ఏంటంటే, ఎలాంటి అసభ్యతకు తావులేకుండా ముత్తయ్య సినిమా తీశారు. ప్రతి పండగకూ అదే పులిహోర, అవే గారెలు చేసుకుని తిన్నట్లే.. ఏదైనా ఫ్యామిలీ డ్రామా చూడాలంటే ‘పసలపూడి వీరబాబు’ చూడాలంతే. అంతకుమించి సినిమాలో ఏమీ ఉండదు. ఇంకో విషయం ఏంటంటే, తెలుగువారి కోసం కూడా ఈ సినిమాను సిద్ధం చేసినట్లు అర్థమవుతోంది. బ్యాగ్రౌండ్లో అన్ని చోట్లా తెలుగు పేర్లు కనిపిస్తాయి. కానీ, ఎందుకు విడుదల చేయలేదో లోగుట్టు ‘వీరబాబు’కే ఎరుక.
ఎవరెలా చేశారంటే: కార్తికి ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి. వీరబాబుగా మాస్ క్యారెక్టర్లో చాలా సులభంగా చేసుకుంటూ వెళ్లిపోయారు. అగ్ర దర్శకుడు శంకర్ కుమార్తె ఈ సినిమాతోనే వెండితెరకు పరిచయం అయ్యారు. పల్లెటూరి అమ్మాయిగా అందంగా కనిపిస్తూనే చక్కటి హావభావాలు పలికించింది. భూపతిలాంటి నెగెటెవ్ షేడ్స్ ఉన్న పాత్రను ప్రకాశ్‌రాజ్ ఎన్నోసార్లు చేశారు. మిగిలిన వాళ్లంతా తమిళ నటులే. సెల్వకుమార్ సినిమాటోగ్రఫీ బాగుంది. పల్లెటూరి అందాలను చక్కగా చూపించారు. వెంకట్ రాజీవ్ ఎడిటింగ్, యువన్ శంకర్‌రాజా సంగీతం ఓకే. పాటలకు పెద్దగా ప్రాధాన్యం లేదు. ముత్తయ్య ఎంచుకున్న కథలో కొంచెం కూడా కొత్తదనం లేదు. ఇంతకుమించి చెప్పడానికి ఏమీ లేదు.
బలాలు
+ క్లీన్ ఎంటర్టైనర్
+ మాస్ ఎలిమెంట్స్
బలహీనతలు
- రొటీన్ కథ
- కొత్తదనం లేని సన్నివేశాలు
చివరిగా: ‘పసలేని’ వీరబాబు
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్‌లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, అమలాపాల్ కీలకపాత్రల్లో బ్లెస్సీ తీసిన ‘ఆడు జీవితం’ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
Om Bhim Bush Review; రివ్యూ: ఓం భీమ్ బుష్.. కామెడీ ఎంటర్టైనర్ అలరించిందా?
om bhim bush review: శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రల్లో నటించిన ‘ఓం భీమ్ బుష్’ ఎలా ఉందంటే? -
ThulasiVanam Review: రివ్యూ: తులసీవనం: మిడిల్‌క్లాస్ కుర్రాడి బయోపిక్
ఓటీటీ ‘ఈటీవీ విన్’లో విడుదలైన ‘తులసీవనం’ వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే? -
Abraham Ozler review: రివ్యూ: అబ్రహాం ఓజ్లర్.. మలయాళ క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉంది?
Abraham Ozler review: జయరామ్, మమ్ముట్టి కీలక పాత్రల్లో నటించిన ‘అబ్రహాం ఓజ్లర్’ ఎలా ఉందంటే? -
Save The Tigers 2 Review: రివ్యూ: సేవ్ ది టైగర్స్ సీజన్ 2.. నవ్వులు రిపీట్ అయ్యాయా?
ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్ ‘సేవ్ ది టైగర్స్ 2’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్’లో విడుదలైన ఈ సిరీస్ ఎలా ఉందంటే? -
Sharathulu Varthisthai Review: రివ్యూ: షరతులు వర్తిస్తాయి.. సినిమా ఎలా ఉందంటే?
Sharathulu Varthisthai Review: చైతన్యరావు కీలక పాత్రలో నటించిన ‘షరతులు వర్తిస్తాయి’ మూవీ మెప్పించిందా? -
Yodha Review: రివ్యూ: యోధ.. యాక్షన్ థ్రిల్లర్ మెప్పించిందా?
సిద్ధార్థ్ మల్హోత్రా, రాశీఖన్నా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ప్రేక్షకులను అలరించిందా..? -
Razakar Movie Review: రివ్యూ: రజాకార్.. బాబీ సింహా, అనసూయ నటించిన మూవీ ఎలా ఉంది?
Razakar Movie Review: తెలంగాణ సాయుధ పోరాటం నేపథ్యంలో రూపొందిన ‘రజాకార్’ ఎలా ఉందంటే? -
Merry Christmas review: రివ్యూ: మెర్రీ క్రిస్మస్.. విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ నటించిన చిత్రం ఎలా ఉందంటే?
విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మెర్రీ క్రిస్మస్’. ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ అవుతోంది. ఎలా ఉందంటే? -
Anweshippin Kandethum Review: రివ్యూ: అన్వేషిప్పిన్ కండెతుమ్.. మలయాళ బ్లాక్‌బస్టర్ ఎలా ఉంది?
Anweshippin Kandethum Review: టొవినో థామస్ కీలకపాత్రలో నటించిన పోలీస్ ప్రొసీడల్ డ్రామా మెప్పించిందా? -
Shaitaan Movie Review: రివ్యూ: షైతాన్.. మాధవన్ నెగెటివ్ షేడ్స్‌లో నటించిన మూవీ మెప్పించిందా?
Shaitaan Movie Review: అజయ్ దేవ్‌గణ్, జ్యోతిక, మాధవన్ కీలక పాత్రల్లో నటించిన మూవీ ఎలా ఉంది? -
Breathe Review: రివ్యూ: బ్రీత్.. నందమూరి చైతన్య కృష్ణ హీరోగా నటించిన సినిమా ఎలా ఉందంటే?
Breathe telugu movie Review: నందమూరి చైతన్య కృష్ణ హీరోగా పరిచయమైన సినిమా ‘బ్రీత్’. వైద్యో నారాయణో హరి అనేది ఉపశీర్షిక. ఓటీటీ ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ చిత్రం ఎలా ఉందంటే? -
Bhimaa movie review: రివ్యూ: భీమా.. గోపిచంద్ ఖాతాలో హిట్ పడిందా?
Bhimaa movie review: యాక్షన్ హీరోగా పేరుతెచ్చుకున్న గోపిచంద్ కీలక పాత్రలో నటించిన ‘భీమా’ మూవీ మెప్పించిందా? -
Gaami review: విశ్వక్సేన్ నటించిన ‘గామి’ ఎలా ఉందంటే..!
అఘోరాగా విశ్వక్సేన్ నటించిన చిత్రం ‘గామి’. మరి ఈ పాత్రలో విశ్వక్ భయపెట్టాడో.. లేదో తెలుసుకుందాం. -
Premalu Movie Review: రివ్యూ: ప్రేమలు.. మలయాళ బ్లాక్‌బస్టర్ తెలుగులో ఎలా ఉంది?
Premalu Movie Review: మలయాళంలో ఘన విజయం సాధించిన ‘ప్రేమలు’ తెలుగులోనూ అదే పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఇక్కడి ప్రేక్షకులను మెప్పించిందా? -
Valari Review: రివ్యూ: వళరి.. రితికా సింగ్ నటించిన హారర్ మూవీ ఎలా ఉందంటే?
Valari Review: రితికా సింగ్ నటించిన హారర్ చిత్రం ‘వళరి’. నేరుగా ప్రముఖ ఓటీటీ ‘ఈటీవీ విన్’లో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందంటే? -
The Indrani Mukerjea Story: రివ్యూ: ‘ది ఇంద్రాణీ ముఖర్జియా స్టోరీ’.. షీనా బోరా హత్య కేసుపై డాక్యుమెంటరీ
షీనా బోరా హత్య కేసుపై రూపొందిన డాక్యుమెంటరీ సిరీస్ ‘ది ఇంద్రాణీ ముఖర్జియా స్టోరీ’. ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ అవుతోంది. -
Bhoothaddam Bhaskar Narayana Review: రివ్యూ: భూతద్దం భాస్కర్ నారాయణ.. థ్రిల్ పంచాడా?
Bhoothaddam Bhaskar Narayana Review: శివ కందుకూరి కీలక పాత్రలో నటించిన మిస్టరీ థ్రిల్లర్ ‘భూతద్దం భాస్కర్ నారాయణ’ ఎలా ఉంది? ప్రేక్షకులకు థ్రిల్ పంచిందా? -
Operation Valentine Review: రివ్యూ: ఆపరేషన్ వాలెంటైన్.. వరుణ్ ఖాతాలో హిట్ పడిందా?
Operation Valentine Review in telugu: పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో వరుణ్ తేజ్ కీలక పాత్రలో శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించిన ‘ఆపరేషన్ వాలెంటైన్’ మెప్పించిందా? -
Malaikottai Vaaliban: రివ్యూ: మలైకోటై వాలిబన్.. మోహన్‌లాల్ నటించిన పీరియాడికల్ చిత్రం ఎలా ఉందంటే?
మలయాళ నటుడు మోహన్‌లాల్ నటించిన తాజా చిత్రం ‘మలైకోటై వాలిబన్’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్’లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఎలా ఉందంటే? -
siddharth roy movie review: రివ్యూ: సిద్ధార్థ్ రాయ్.. దీపక్ సరోజ్ నటించిన మూవీ ఎలా ఉంది?
siddharth roy movie review: ప్రచార చిత్రాలతో ఆసక్తిని పెంచిన ‘సిద్ధార్థ్ రాయ్’ ప్రేక్షకులను మెప్పించిందా? లేదా?
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్‌గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు