Sardar OTT: ఓటీటీలో కార్తి ‘సర్దార్’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

కార్తి కీలక పాత్రలో నటించిన ‘సర్దార్’ ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది.

Published : 12 Nov 2022 01:59 IST

హైదరాబాద్‌: కార్తి కీలక పాత్రలో నటించిన స్పై థ్రిల్లర్‌ ‘సర్దార్’. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకోవడమే కాదు, రూ.100కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. ఈ చిత్ర తెలుగు, తమిళ ఓటీటీ రైట్స్‌ను ఆహా దక్కించుకున్న సంగతి తెలిసిందే. నవంబర్ 18వ తేదీ నుంచి తెలుగు, తమిళ భాషల్లో  ‘సర్దార్’ స్ట్రీమింగ్‌ కానుంది. ఈ చిత్రానికి పి.ఎస్‌.మిత్రన్‌ దర్శకత్వం వహించారు.

క‌థేంటంటే: విజ‌య్ ప్ర‌కాశ్ (కార్తి) ఓ పోలీస్ ఇన్‌స్పెక్ట‌ర్. సోష‌ల్ మీడియాలో త‌ర‌చూ ట్రెండింగ్ అవుతుంటాడు. అత‌ని స‌మ‌య‌స్ఫూర్తి తెలివి తేట‌లు అలాంటివి.  ప‌ని కంటే ముందు చుట్టూ మీడియా ఉందో లేదో చూసుకుంటుంటాడు.  ఉంద‌ని తెలిశాకే త‌న ప‌ని మొద‌లు పెడ‌తాడు. ట్రెండింగ్‌లో ఉండ‌టమంటే అంత పిచ్చి.  ఆంధ్రా యూనివర్సిటీ నుంచి ఓ ముఖ్య‌మైన ఫైల్ మాయం అవుతుంది. అందులో సైనిక ర‌హ‌స్యాలు ఉన్నాయ‌ని తెలుస్తాయి.  ఆ ఫైల్ ఎక్క‌డుందో క‌నిపెట్టేందుకు సీబీఐ, రా అధికారులు రంగంలోకి దిగుతారు. విష‌యం తెలుసుకున్న విజ‌య్ ప్ర‌కాశ్ త‌నకి మ‌రింత ప్రాచుర్యం ల‌భిస్తుంద‌ని ఆ ఫైల్ క‌నుక్కునేందుకు న‌డుం బిగిస్తాడు.  ఆ క్ర‌మంలో విజయ్ ప్రకాష్‌కి తన తండ్రి సర్దార్ (కార్తి) గురించి, ఆయ‌న మిష‌న్ గురించి తెలుస్తుంది. దేశ‌ద్రోహిగా ముద్ర‌ప‌డిన స‌ర్దార్ ఎవ‌రు? ఎక్క‌డుంటాడు?  ఆయ‌న చేప‌ట్టిన మిష‌న్‌లో విజ‌య్ ప్ర‌కాశ్ ఎలా భాగం అయ్యాడు? త‌దిత‌ర విష‌యాల‌తో మిగ‌తా క‌థ సాగుతుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని