Karthi: ‘96’ దర్శకుడితో..
‘సర్దార్’, ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమాలతో వరుస విజయాలందుకొని జోరు మీదున్నారు కథానాయకుడు కార్తి. ఇప్పుడీ ఆ జోష్‌లోనే ఆయన ‘జపాన్’గా సెట్స్‌పై ముస్తాబవుతున్న సంగతి తెలిసిందే.
‘సర్దార్’, ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమాలతో వరుస విజయాలందుకొని జోరు మీదున్నారు కథానాయకుడు కార్తి (Karthi). ఇప్పుడీ ఆ జోష్‌లోనే ఆయన ‘జపాన్’గా సెట్స్‌పై ముస్తాబవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చెన్నైలో తుది దశ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా.. దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, కార్తి ఇప్పుడు మరో ప్రాజెక్టుకి పచ్చజెండా ఊపినట్లు తెలిసింది. ‘96’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారని సమాచారం. ‘కార్తి 27’గా పట్టాలెక్కనున్న ఈ చిత్రాన్ని 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మించనుంది. అంతేకాదు ఇందులో అరవింద్‌స్వామి ప్రతినాయకుడిగా కనిపించనున్నారట. కుటుంబ అనుబంధాల నేపథ్యంలో సాగే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉండనున్నట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. ‘జపాన్’ పూర్తయిన వెంటనే కొత్త సినిమా పట్టాలెక్కనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ganesh Nimajjanam: ఘనంగా నిమజ్జనోత్సవం.. గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ గణేశుడు
-
Bengaluru: చివరి నిమిషంలో ట్రెవర్ షో రద్దు.. క్షమాపణలు కోరిన బుక్ మై షో
-
Congress MLA: డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్ట్
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Team India: నేను ధ్రువీకరించకూడదు.. వారే చెబుతారు: తుది జట్టుపై రాహుల్ ద్రవిడ్
-
Madhya Pradesh rape: ఆటోలో రక్తపు మరకలు.. సాయం కోసం 8 కి.మీ: మధ్యప్రదేశ్ రేప్ ఘటనలో మరిన్ని విషయాలు