Ponniyin Selvan: ఆ ఇద్దరు హీరోలకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పిన కార్తి

రజనీ కాంత్, కమల్‌హాసన్‌లను కృతజ్ఞతలు చెబుతూ కార్తి ట్విట్‌ చేశారు.

Published : 07 Oct 2022 13:13 IST

హైదరాబాద్‌: భారీ అంచనాల మధ్య విడుదలైన ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ సినిమా ప్రేక్షకాదరణ పొందుతూ సినీ విమర్శకుల ప్రశంసలను అందుకుంటోంది. ఈ సినిమా చూసిన ప్రముఖులు సైతం సోషల్‌మీడియా వేదికగా చిత్ర బృందానికి అభినందనలు తెలుపుతున్నారు. తాజాగా ఓ ప్రైవేటు స్క్రీన్‌లో పొన్నియిన్‌ సెల్వన్‌ చూసిన రజనీకాంత్‌ మణిరత్నంతో పాటు నటీనటులందరినీ వ్యక్తిగతంగా పిలిచి మెచ్చుకొన్నారు. మరోవైపు కమల్‌హాసన్‌ పొన్నియిన్‌ సెల్వన్‌ హీరోలు కార్తి, విక్రమ్‌లతో కలిసి ఆ సినిమాను వీక్షించారు. ఆ తర్వాత సినిమా టీం అందరినీ అభినందించారు.

రజనీ, కమల్‌ను ఉద్దేశిస్తూ కార్తి ట్విట్‌ చేశారు. అందులో ‘‘రజనీకాంత్‌ సర్‌ మీ నుంచి వచ్చిన కాల్‌ చాలా ప్రత్యేకమైనది. ఇతరుల పనిని మెచ్చుకొని వారిని ప్రొత్సహించడంలో మీరెప్పుడూ ముందుంటారు. ధన్యవాదాలు’’. ‘‘కమల్‌ సర్‌ నేను ఉన్నత లక్ష్యాలను చేరడానికి నాకు మీరెప్పుడూ స్ఫూర్తినిస్తుంటారు. దానికి మించి ఎదుటి వ్యక్తిని ఎలా గౌరవించాలన్నది మిమ్మల్ని చూసి నేర్చుకున్నాను’’అంటూ కృతజ్ఞతలు తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని