Karthi: కార్తి జోరు.. నెలకో సినిమా విడుదల

నెలకో సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు నటుడు కార్తి. ఆ సినిమాలేంటో ఓ లుక్కేయండి...

Published : 25 May 2022 01:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కార్తి పోలీసు అధికారిగా నటిస్తున్న చిత్రం ‘సర్దార్‌’. రాశిఖన్నా, రజిషా విజయన్‌ కథానాయికలు. పి.ఎస్‌. మిత్రన్‌ దర్శకుడు. దీపావళి సందర్భంగా ఈ ఏడాది అక్టోబరులో ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం తాజాగా ప్రకటించింది. ఈ మేరకు కార్తి లుక్‌ను పంచుకుంది. ఇందులో ఆయన కళ్లద్దాలు పెట్టుకుని, మైక్‌ పట్టుకుని చాలా స్టైలిష్‌గా కనిపించారు. ఈ లుక్‌ సినిమాలోని ఓ ప్రమాద సన్నివేశానికి సంబంధించిందని అర్థమవుతోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌తోపాటు ఈ సినిమా మోషన్‌ పోస్టర్‌ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించాయి. ప్రిన్స్‌ పిక్చర్స్‌ సంస్థ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్‌. లక్ష్మణ్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు. తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. దర్శకుడు పీఎస్‌ మిత్రన్‌ గతంలో తెరకెక్కించిన ‘అభిమన్యుడు’ చిత్రం విశేష క్రేజ్‌ సంపాదించుకోవడంతో ‘సర్దార్‌’పై అంచనాలు పెరుగుతున్నాయి. మరోవైపు, కార్తి నటించిన ‘విరుమన్‌’ ఆగస్టు 31, ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ సెప్టెంబరు 30న విడుదలకానుండటంతో ఆయన అభిమానుల్లో జోష్‌ కనిపిస్తోంది. ఆ అప్‌డేట్లను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ సందడి చేస్తున్నారు. బుధవారం (మే 25) కార్తి పుట్టినరోజు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని