నన్ను నిషేధించి.. వాళ్లకి పనిస్తున్నారు..!

ప్రముఖ దర్శకుడు మణిరత్నం తన తర్వాతి ప్రాజెక్టు ‘నవరస’ను ప్రకటించారు. ఆయన, జయేంద్ర పంచపకేశన్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తొమ్మిది కథలతో.. తొమ్మిది మంది దర్శకులు ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. కేవీ ఆనంద్, గౌతమ్ మేనన్‌, బిజోయ్ నంబియార్, కార్తీక్ సుబ్బరాజు, పొన్ రామ్......

Published : 29 Oct 2020 01:42 IST

మణిరత్నంను ప్రశ్నించిన చిన్మయి

చెన్నై: ప్రముఖ దర్శకుడు మణిరత్నం తన తర్వాతి ప్రాజెక్టు ‘నవరస’ను ప్రకటించారు. ఆయన, జయేంద్ర పంచపకేశన్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తొమ్మిది కథలతో.. తొమ్మిది మంది దర్శకులు ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. కేవీ ఆనంద్, గౌతమ్ మేనన్‌, బిజోయ్ నంబియార్, కార్తీక్ సుబ్బరాజు, పొన్ రామ్, హలిత షలీమ్, అరవింద్ స్వామి, కార్తీక్ నరేన్, రతీంద్రన్ ప్రసాద్ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారు. ఎటువంటి పారితోషికం తీసుకోకుండా వీరు ఈ సినిమా కోసం పనిచేయబోతుండటం విశేషం. దీన్ని ఓటీటీ వేదికగా విడుదల చేయబోతున్నారు.

కాగా ఈ సినిమా కోసం గాయకుడు కార్తిక్‌ కూడా పనిచేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ‘మీటూ’ ఆరోపణలు ఉన్న అతడ్ని మణిరత్నం తన సినిమాకు తీసుకోవడం పట్ల పలువురు నెటిజన్లు, గాయని చిన్మయి అభ్యంతరం వ్యక్తం చేశారు. తనలాంటి బాధితులు పనిలేక ఇబ్బందులు పడుతుంటే.. వేధించిన వారికి మాత్రం పని కల్పిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. పలువురు నెటిజన్లు చేసిన ట్వీట్లను ఉద్దేశిస్తూ చిన్మయి స్పందించారు. వేధింపుల ఆరోపణలు ఉన్న వ్యక్తికి అండగా ఉండి, అతడికి ప్లాట్‌ఫాం ఏర్పాటు చేయడం బాధాకరమన్నారు. వైరముత్తుకు ఎంత మద్దతు ఉందో కార్తీక్‌కు కూడా అంతే అండ ఉందని పేర్కొన్నారు. వైరముత్తు, రాధారవి తనను నిషేధించారని, తనపై తప్పుడు ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. చాలా మంది గాయకులు, మహిళలు మౌనంగా వైరముత్తుతో కలిసి పనిచేస్తున్నారని తెలిపారు. ఈ ఘటనపై పలువురు నెటిజన్లు సైతం కామెంట్లు చేయడంతో.. మణిరత్నం హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండ్‌ అవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని