karthikeya 2 ott release: ఓటీటీలో ‘కార్తికేయ2’.. అదొక్కటే మిగిలింది!

ఇటీవల కాలంలో ఒక సినిమా ఓటీటీలో విడుదలవటం కోసం ఇంతలా ఎవరూ వేచి చూడలేదంటే అతిశయోక్తి కాదు. చిన్న సినిమాగా విడుదలై,

Published : 26 Sep 2022 18:09 IST

హైదరాబాద్‌: ఇటీవల కాలంలో ఒక సినిమా ఓటీటీలో విడుదలవటం కోసం ఇంతలా ఎవరూ వేచి చూడలేదంటే అతిశయోక్తి కాదు. చిన్న సినిమాగా విడుదలై, అన్ని భాషల్లో బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షాన్ని కురిపించిన చిత్రం ‘కార్తికేయ2’ (karthikeya 2). నిఖిల్‌ కథానాయకుడిగా చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ దసరాకు ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది. జీ5 వేదికగా అక్టోబరు 5న ‘కార్తికేయ2’ అందుబాటులోకి రానుంది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ సోషల్‌మీడియాలో వరుస ట్వీట్లు వస్తున్నాయి. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ‘కార్తికేయ2’ను చూడవచ్చు. అక్టోబరు 5న జీ5లో ‘కార్తికేయ2’ అంటూ చేసిన పలు పోస్టులను కథానాయకుడు నిఖిల్‌ కూడా లైక్‌ చేయడం ఈ వార్తకు మరింత బలం చేకూరినట్లైంది. అయితే, జీ5 మాత్రం ఇప్పటివరకూ దీనిపై అధికారికంగా స్పందించలేదు. ఆ ఒక్క ప్రకటనే మిగిలింది. ఈ చిత్రంలో నిఖిల్‌తో పాటు అనుపమ పరమేశ్వరన్‌, శ్రీనివాసరెడ్డి, వైవా హర్ష తదితరులు నటించారు. అనుపమ్‌ఖేర్‌ అతిథిపాత్రలో మెరిశారు. ఆగస్టు 13నవిడుదలైన ఈ సినిమా ఏకంగా రూ.120కోట్ల వసూళ్లు సాధించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని