Published : 12 Aug 2022 01:36 IST

karthikeya 2: ‘రాసిపెట్టుకోండి ఈ చిత్రం హిందీలోనూ అంతే కలెక్ట్‌ చేస్తుంది’: విజయేంద్ర ప్రసాద్‌

హైదరాబాద్‌: నిఖిల్‌ (Nikhil Siddharth) హీరోగా చందు మొండేటి తెరకెక్కించిన చిత్రం ‘కార్తికేయ 2’ (Karthikeya 2). ఇదే కాంబినేషన్‌లో గతంలో సూపర్ హిట్‌ అందుకున్న ‘కార్తికేయ’కి సీక్వెల్‌గా రూపొందింది. అనుపమ పరమేశ్వరన్‌ (Anupama Parameshwaran) కథానాయిక. ఈ సినిమాని ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించింది. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు, దర్శక- రచయిత విజయేంద్ర ప్రసాద్‌, యువ నటులు అడివి శేష్‌, సిద్ధు జొన్నలగడ్డ అతిథులుగా హాజరయ్యారు.

తలసాని మాట్లాడుతూ.. ‘‘గత శుక్రవారం విడుదలైన రెండు సినిమాలని ప్రేక్షకులు ఎంతగా ఆదరించారో కార్తికేయ 2నీ అలానే ఆదరిస్తారని ఆశిస్తున్నా. గతంలో వచ్చిన ‘కార్తికేయ’ చూశా. నిఖిల్‌ చాలా బాగా నటించాడు. యువ నటులను ప్రోత్సాహించాలనే ఉద్దేశంతో నేనెంత బిజీగా ఉన్నా ఈ వేడుకకు వచ్చా. చిన్న చిత్రాలు, సందేశాత్మక సినిమాలు తీసిన వారికి థియేటర్లు, విడుదలలో ఇబ్బందులుంటే నేను అండగా నిలుస్తానని మరోసారి చెప్తున్నా. ఇండస్ట్రీలో కొన్ని ఇబ్బందులున్న సంగతి తెలిసిందే. చిత్ర పరిశ్రమకు ప్రభుత్వ సహకారం ఎప్పుడూ ఉంటుంది. దర్శకుడు రాజమౌళిగారి వల్ల తెలుగు చిత్రపరిశ్రమ సత్తా ఏంటో ప్రపంచ వ్యాప్తంగా తెలిసింది. ఆయన తెరకెక్కించిన ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రాలు దేశ విదేశాల్లో మంచి ఆదరణ దక్కించుకున్నాయి’’ అని తలసాని పేర్కొన్నారు.

అనంతరం విజయేంద్ర ప్రసాద్‌ (Vijayendra Prasad) మాట్లాడుతూ ‘‘ఇలాంటి వేడుకలకు వెళ్లాలంటే ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. సినిమా ఆడదని తెలిసినా తప్పదు కాబట్టి బాగుంటుందని చెప్పాల్సి వస్తుంది. ‘కార్తికేయ 2’ మాత్రం అలా కాదు. చాలా పెద్ద హిట్‌ అవుతుందని మనస్ఫూర్తిగా చెప్తున్నా. నిర్మాతలూ.. రాసి పెట్టుకోండి ఈ సినిమా తెలుగులో ఎంత కలెక్ట్‌ చేస్తుందో హిందీలోనూ అంతే చేస్తుంది’’ అని అన్నారు.Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని