Nikhil: ‘కార్తికేయ3’ గురించి ఆసక్తికర అప్‌డేట్‌ ఇచ్చిన నిఖిల్‌!

ప్రస్తుతం 18 పేజెస్‌(18 Pages) విజయాన్ని ఆస్వాధిస్తున్న నిఖిల్‌‌(Nikhil) ‘కార్తికేయ3’ గురించి క్రేజీ ఆప్‌డేట్‌ చెప్పారు. 

Published : 27 Dec 2022 17:47 IST

హైదరాబాద్‌: వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో నిఖిల్‌(Nikhil). ఈ హీరో నటించిన కార్తికేయ2 (Karthikeya 2) భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. చిన్న సినిమాగా విడుదలైన ఆ చిత్రం వసూళ్ల వర్షం కురిపించింది. ఇక ఆ సినిమా సీక్వెల్‌కు సంబంధించి  నిఖిల్‌ ఒక లేటెస్ట్‌ అప్‌డేట్‌ చెప్పారు. ట్విటర్‌లో అభిమానులతో ముచ్చటించిన నిఖిల్‌. ‘కార్తికేయ3’ గురించి ఆసక్తికరమైన విషయం వెల్లడించాడు. ‘‘కార్తికేయ3’ (Karthikeya 3)కచ్చితంగా ఉంటుంది. ఈ సారి మిమ్మల్ని మరింత అలరించడానికి 3డీలో రానుంది’ అని చెప్పారు.

నిఖిల్‌ తాజాచిత్రం ‘18 పేజెస్‌’ సూపర్‌ సక్సెస్‌ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆస్క్‌ నిఖిల్‌(#Asknikhil) అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్విటర్‌లో ఫ్యాన్స్‌ అడిగిన ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ‘18 పేజెస్‌’ సినిమాకు వస్తున్న స్పందన  చూస్తుంటే చాలా ఆనందంగా ఉందన్నారు. బాలీవుడ్‌ హీరోల్లో షారుక్‌ ఖాన్‌ అంటే ఇష్టమన్న నిఖిల్‌.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ భారతదేశం గర్వించదగిన సినిమా అని అన్నారు. ఒక్కమాటలో రామ్‌ చరణ్ గురించి చెప్పమని ఒక అభిమాని అడగ్గా.. ‘చరణ్‌ చాలా మంచి వ్యక్తి. ‘కార్తికేయ2’ సినిమా చూసి సూపర్‌ హిట్‌ అవుతుందని మొదట చెప్పాడు’ అని సమాధానమిచ్చాడు. 

అన్ని రకాల సినిమాల్లోనూ నటిస్తానని చెప్పిన నిఖిల్‌.. ‘కార్తికేయ’ సినిమా తన బాధ్యతను మరింత పెంచిందన్నారు. త్వరలోనే ‘కార్తికేయ3’కు సంబంధించిన మరికొన్నివిషయాలు వెల్లడిస్తామని చెప్పారు. ఇక 18 పేజెస్‌ (18 Pages) సినిమా కొవిడ్‌కు ముందు మొదలవ్వాల్సిందని.. అప్పుడే ఈ చిత్రానికి సంబంధించిన పనులు మొదలు పెట్టామని అన్నారు. ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులను మాత్రమే దృష్టిలో పెట్టుకుని తీశారని. అందుకే హిందీలో విడుదలచేయలేదని చెప్పారు. ఇక బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ గురించి చెబుతూ.. ఆయన మంచి నటుడు, అంతకంటే మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని