Chandoo Mondeti: టాలీవుడ్‌ దర్శకుడుతో బాలీవుడ్‌ హీరో సినిమా...!

టాలీవుడ్‌లో ఉన్న యంగ్‌ డైరెక్టర్‌లలో చందూ మొండేటి ఒకరు. ‘కార్తికేయ’ సినిమాతో ఈ దర్శకుడు అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక దాని సీక్వెల్‌ ‘కార్తికేయ2’తో దేశ వ్యాప్తంగా అఖండ విజయాన్ని అందుకుని అందరి ప్రశంసలు అందుకున్నాడు.

Updated : 29 Sep 2022 16:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టాలీవుడ్‌లో ఉన్న యంగ్‌ డైరెక్టర్‌లలో చందూ మొండేటి ఒకరు. ‘కార్తికేయ’ సినిమాతో ఈ దర్శకుడు అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక దాని సీక్వెల్‌ ‘కార్తికేయ2’తో దేశ వ్యాప్తంగా అఖండ విజయాన్ని అందుకుని అందరి ప్రశంసలు అందుకున్నాడు. చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఎక్కువ ప్రమోషన్స్ కూడా చేయకుండానే 100 కోట్లకు పైగా వసూళ్లు చేసి ఊహించని రికార్డు అందుకుంది. దీంతో ఈ టాలెంటెడ్‌ డైరెక్టర్‌కు వరుస ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ దర్శకుడు పాన్‌ ఇండియా ఫిల్మ్‌ చేయడానికి ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దానికి సంబంధించిన కథను సిద్ధం చేసుకున్నారట. బాలీవుడ్‌కు చెందిన ఒకరిద్దరు బడా హీరోలతో ఈ సినిమా తీయనున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఆ హీరోలు ఎవరో తెలుసుకోవడం కోసం నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు.

‘కార్తికేయ2’ తర్వాత అల్లు అరవింద్‌ గీతా ఆర్ట్స్‌తో ఓ సినిమా చేసేందుకు చందూ మొండేటి చర్చలు జరిపారని టాక్‌. ఇక ఈ సినిమాలో హీరోలుగా బాలీవుడ్‌ హీరోలు హృతిక్‌ రోషన్‌, రణ్‌బీర్‌ కపూర్‌ పేర్లు వినిపిస్తున్నప్పటికీ హృతిక్‌నే ఫైనల్‌ చేసే అవకాశమున్నట్లు సమాచారం. ఇదే నిజమైతే టాలీవుడ్‌ దర్శకుడు బాలీవుడ్‌ హీరో కాంబినేషన్‌లో త్వరలోనే ఓ సినిమా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతుంది. అయితే దీనిపై అటు గీతా ఆర్ట్స్‌ కానీ, ఇటు చందూ మొండేటీ కానీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని