Kartik Aaryan: ఐఎన్‌ఎస్‌ కోల్‌కతా యోధులతో కలిసి కార్తీక్‌ ఆర్యన్‌ సందడి..

స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలకు ముందు రోజులు బాలీవుడ్‌ స్టార్‌ కార్తీక్‌ ఆర్యన్‌ భారత నౌకాదళంలోని స్టెల్త్‌ మిసైల్‌ డెస్ట్రాయర్‌ సిబ్బందితో కలిసి ఉత్సాహంగా గడిపారు. దీనికి సంబంధించిన వీడియోలు,

Updated : 15 Aug 2022 10:25 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలకు ముందు రోజు బాలీవుడ్‌ స్టార్‌ కార్తీక్‌ ఆర్యన్‌ భారత నౌకాదళంలోని స్టెల్త్‌ మిసైల్‌ డెస్ట్రాయర్‌ సిబ్బందితో కలిసి ఉత్సాహంగా గడిపారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలను ఆయన సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశారు. ‘‘జై జవాన్‌. ఏక్‌ దిన్‌ నౌసేనాకే జాంబాజ్‌ జవానోంకే సాథ్’’‌( ఒక రోజు నౌకాదళ పోరాట యోధులతో) అని క్యాప్షన్‌ ఇచ్చారు.

భారత నౌకాదళ అధికారులతో కలిసి ఆయన ఫొటోలకు పోజులిచ్చారు. వారితో  కలిసి కిచెన్‌లో రోటీలు, జిలేబీ తయారు చేశారు. అక్కడి నేవీ ఆఫీసర్లతో ఫిట్‌నెస్‌ పోటీల్లో పాల్గొన్నారు. సిబ్బందితో కలిసి వీడియోగేమ్స్‌ ఆడటంతో పాటు భాంగ్రా నృత్యాలు చేశారు. నౌకపై  వినియోగించే మిషిన్‌గన్‌ వాడాలంటే శారీరకంగా ఎంత దృఢంగా ఉండాలో తెలుసుకొన్నారు. 

భారత నౌకాదళంలో ఐఎన్‌ఎస్‌ కోల్‌కతా ప్రధాన డెస్ట్రాయర్‌. దీనిని 2014 ఆగస్టు 16న భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా కమిషన్‌ చేశారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని