Kartik Aaryan: బాలీవుడ్‌ నటితో ప్రేమ.. నిజమే : కార్తిక్‌ ఆర్యన్‌

‘భూల్ భులయా 2’తో సూపర్‌ సక్సెస్‌ అందుకోవడంతోపాటు బాలీవుడ్‌ పరిశ్రమకు చాలా కాలం తర్వాత సూపర్‌హిట్‌ని అందించారు యువ నటుడు కార్తిక్‌ ఆర్యన్‌. అనీస్‌ దర్శకత్వం వహించిన ఈసినిమాలో కార్తిక్‌ జోడీగా....

Published : 26 May 2022 01:25 IST

ఇంటర్వ్యూలో అసలు విషయం బయటపెట్టిన నటుడు

ముంబయి: ‘భూల్ భులయ్యా 2’తో సూపర్‌ సక్సెస్‌ అందుకోవడంతోపాటు బాలీవుడ్‌ పరిశ్రమకు చాలా కాలం తర్వాత సూపర్‌హిట్‌ని అందించారు యువ నటుడు కార్తిక్‌ ఆర్యన్‌. అనీస్‌ దర్శకత్వం వహించిన ఈసినిమాలో కార్తిక్‌కు జోడీగా నటి కియారా అడ్వాణీ నటించగా, టబు కీలకపాత్ర పోషించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద రూ.66 కోట్లు వసూళ్లు రాబట్టినట్లు సినీ విశ్లేషకుల అంచనా. ఈ సినిమా విజయంతో ఫుల్‌ ఖుషీలో ఉన్న కార్తిక్‌ తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు.

‘‘బాలీవుడ్‌కు చెందిన హీరోయిన్‌తో మీరు ప్రేమలో ఉన్నారా?’’ అని ప్రశ్నించగా.. ‘‘ఉన్నాను. గతంలో ఓ బీటౌన్‌ నటిని ప్రేమించాను. కానీ ఆమె పేరు మాత్రం బయటపెట్టను’’ అని కార్తిక్‌ అన్నారు. అనంతరం, నటీనటుల రిలేషన్‌షిప్‌పై మీడియాలో వచ్చే కథనాల గురించి స్పందిస్తూ.. ‘‘షూటింగ్స్‌ నుంచి విరామం దొరికినప్పుడు కోస్టార్స్‌తో కలిసి కాఫీకి వెళ్లినా లేదా ఏదైనా ప్రాంతానికి వెళ్లినా.. వాళ్లిద్దరూ రిలేషన్‌లో ఉన్నారంటూ పలువురు అసత్య ప్రచారాలు సృష్టిస్తారు’’ అని తెలిపారు. ఇక, ‘లవ్‌ ఆజ్‌ కల్‌ 2’ చిత్రీకరణ సమయంలో సారా-కార్తిక్‌ ప్రేమలో ఉన్నట్లు వార్తలు పుట్టాయి. అనంతరం ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో విడిపోయారని చెప్పుకున్నారు. ఈ క్రమంలో కార్తిక్‌ మరో హీరోయిన్‌తో ప్రేమలో ఉన్నారని నెట్టింట పుకార్లు వినిపిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని