Kartik Aaryan: కార్తిక్‌.. నన్ను పెళ్లి చేసుకుంటే రూ.20 కోట్లు ఇస్తా..!

తన అభిమాన నటుడ్ని పెళ్లి చేసుకోవాలని ఏ యువతైనా ఆశ పడుతుంది. ఏదో ఒక రకంగా 

Updated : 11 Mar 2022 11:58 IST

హీరోకి భారీ ప్రపోజల్‌ పెట్టిన ఫ్యాన్‌

ముంబయి: తన అభిమాన నటుడ్ని పెళ్లి చేసుకోవాలని ఏ యువతైనా ఆశ పడుతుంది. ఏదో ఒక రకంగా ఆ నటుడికి తన ప్రేమను తెలియజేయాలనుకుంటుంది. ఈ క్రమంలోనే పలువురు యువతులు తమకిష్టమైన హీరోకి సోషల్‌మీడియా వేదికగా ప్రపోజ్‌లు చేస్తారు. మరికొంతమంది హీరో అడ్రస్ తెలుసుకుని స్పెషల్‌ గిఫ్ట్‌లు పంపిస్తారు. ఇవన్నీ సర్వసాధారణంగా చూస్తాం. కానీ, ఓ అమ్మాయి మాత్రం తనకిష్టమైన హీరోకి భారీ పెళ్లి ప్రపోజల్‌ పంపి అందర్నీ ఆశ్చర్యపరిచింది. సోషల్‌మీడియా వేదికగా ఆమె పెట్టిన ఓ పోస్ట్‌ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఆ హీరో ఎవరంటే.. కార్తిక్‌ ఆర్యన్‌.

‘ప్యార్‌ కా పంచనామా’తో నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, మొదటి సినిమాతో మహిళల్లో ఫుల్‌ క్రేజ్‌ సొంతం చేసుకున్న బాలీవుడ్‌ యువ కథానాయకుడు కార్తిక్‌ ఆర్యన్‌. కెరీర్‌ ఆరంభంలోనే స్టార్‌ స్టేటస్‌ సొంతం చేసుకున్న కార్తిక్‌ ఇప్పుడు వరుస అవకాశాలతో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం ‘భూల్‌ భూలియా -2’, ‘షెహ్‌జాదా’ చిత్రాలు చేస్తున్నారు. కాగా, షూట్స్‌లో కాస్త విరామం దొరకడంతో ‘లూడో’ ఫేమ్‌, బాలనటి ఇనాయత్‌ వర్మతో కలిసి కార్తిక్‌ తాజాగా ఓ స్పెషల్‌ వీడియో క్రియేట్‌ చేశారు. కార్తిక్‌ నటించిన ‘ధమాకా’లోని ఓ పవర్‌ఫుల్‌ డైలాగ్‌ని ఇనాయత్‌ చెప్పగానే.. క్యూట్‌గా ఉందంటూ ఆయన నవ్వులు పూయించారు. దీనికి సంబంధించిన వీడియోని కార్తిక్‌ ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేయగా.. దానిపై స్పందించిన ఓ లేడీ ఫ్యాన్‌.. ‘‘కార్తిక్‌.. మీరంటే నాకు ఇష్టం. మీకు రూ.20 కోట్లు ఇస్తా. నన్ను పెళ్లి చేసుకోండి’’ అని పోస్ట్ చేసింది. దానిపై స్పందించిన కార్తిక్‌.. ‘‘ఎప్పుడు’’ అని సరదాగా రిప్లై ఇచ్చారు. అనంతరం తనపై బిడ్డింగ్‌ ప్రారంభమైందని అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు