Kartik Aaryan: ఆమె చేసిన పనికి నేను కంగారుపడ్డా: కార్తిక్ ఆర్యన్‌

అభిమానులు తనపై చూపించే ప్రేమకు తాను ఎంతో ఆనందిస్తున్నానని అన్నారు నటుడు కార్తిక్‌ ఆర్యన్‌. కొన్నిసార్లు వాళ్లు చూపించిన అతి ప్రేమ వల్ల తాను ఇబ్బందులు పడ్డానని ఆయన తెలిపారు. 

Published : 01 Dec 2022 14:18 IST

ముంబయి: ‘భూల్‌ భులయ్యా-2’తో బాలీవుడ్‌లో ఒక్కసారిగా సెన్సేషనల్‌ స్టార్‌ అయ్యారు యువ నటుడు కార్తిక్‌ ఆర్యన్ (Kartik Aaryan)‌. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తోన్న ఆయన తాజాగా ‘ఫ్రెడ్డీ’ ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు. పలువురు యువతులు తనపై చూపించే అభిమానం పై ఆయన స్పందించారు. ‘‘మహిళా అభిమానుల ఆదరణ సొంతం చేసుకుంటున్నందుకు నాకెంతో ఆనందంగా ఉంది. అయితే, కొంతకాలం క్రితం ఓ మహిళా అభిమాని.. మాకు పెళ్లి అయిపోయినట్లు ఓ ఫొటోని మార్ఫింగ్‌ చేసి.. మా ఇంటి ముందు గొడవ చేసింది. అక్కడికి వచ్చిన వారందరితో కార్తిక్ నా భర్త అని చెప్పింది. నా సిబ్బంది ఆమెను అక్కడి నుంచి పంపించి వేశారు. ఈ విషయం నాకు ఆలస్యంగా తెలిసింది. చాలా కంగారుపడ్డా. బాబోయ్‌ ఇలా కూడా జరుగుతాయా?అనుకున్నా’’ అని కార్తిక్‌ తెలిపారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని