అప్పుడు బాలీవుడ్ డాన్లను వేడి కాఫీలో ముంచుతారు: వివేక్ అగ్నిహోత్రి
‘బాయ్‌కట్ లాల్ సింగ్ చడ్డా’ వ్యవహారంపై ఇప్పటికీ ప్రముఖుల వాదోపవాదాలు కొనసాగుతున్నాయి. ఇటీవల ఆ చిత్ర కథానాయిక కరీనాకపూర్(kareena kapoor) ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ...
ఇంటర్నెట్ డెస్క్: ‘బాయ్‌కట్ లాల్ సింగ్ చడ్డా’ వ్యవహారంపై ఇప్పటికీ ప్రముఖుల వాదోపవాదాలు కొనసాగుతున్నాయి. ఇటీవల ఆ చిత్ర కథానాయిక కరీనాకపూర్(kareena kapoor) ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘ఇంత మంచి సినిమాను ఎందుకు బహిష్కరిస్తున్నారో తెలియట్లేదు. 250మంది రెండున్నర సంవత్సరాల పాటు ఈ సినిమా కోసం కష్టపడ్డారు’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యలపై బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి (Vivek Agnihotri) స్పందించారు.
తన వ్యక్తిగత ట్విటర్ ఖాతాలో ఆయన ‘చిన్న సినిమాలను, కంటెంట్ ఉన్న సినిమాలను బాలీవుడ్ డాన్లుగా పేరు పొందిన వ్యక్తులు ఆపినప్పుడు, వారి సినిమాలకు థియేటర్లు ఇవ్వకుండా అడ్డుకున్నపుడు మీరెందుకు స్పందించలేదు. ఎందరో ప్రతిభ కలిగిన నటులు, రచయితల జీవితాల నాశనమయ్యాయి కదా! ఆ సినిమాలకు పనిచేసింది ఆ 250మంది పేద ప్రజలే’ అంటూ కరీనాకు కౌంటర్ ఇచ్చారు.
వెంటనే మరో ట్వీట్లో ‘ బాలీవుడ్ డాన్ల దురహంకారం, ఫాసిజం, హిందూ ఫోబియా గురించి భారతీయులకు తెలిసినప్పుడు వారిని వేడి కాఫీలో ముంచేస్తారు’ అంటూ తన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఏడాది మార్చిలో ‘ది కశ్మీర్ ఫైల్స్’(The Kashmir Files) చిత్ర విజయంతో సంచలనం సృష్టించిన వివేక్ అగ్నిహోత్రి ప్రస్తుతం ‘ది ఢిల్లీ ఫైల్స్’(The Delhi Files)ను తెరకెక్కించే పనిలో ఉన్నారు. 1984నాటి సిక్కు అల్లర్ల నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందని ఆయన ప్రకటించారు. రూ.25కోట్లతో తీసిన ‘కశ్మీర్ ఫైల్స్’ చిత్రం రూ.340 కోట్ల వసూళ్లతో బాలీవుడ్లో ఈ ఏడాది ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం
-
కేజ్రీవాల్‌పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్