kathi mahesh: రోడ్డు ప్రమాదంలో కత్తిమహేశ్‌కు తీవ్రగాయాలు

నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో

Updated : 26 Jun 2021 16:19 IST

కొడవలూరు: సినీనటుడు, విశ్లేషకుడు కత్తి మహేశ్‌ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనం నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీని వేగంగా ఢీ కొట్టింది. దీంతో మహేశ్‌ వాహనం ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. ఎయిర్‌ బ్యాగ్స్‌ తెరుచుకున్నా, తల భాగంలో మహేశ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆయన్ని నెల్లూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఎడమ కంటికి తీవ్రగాయమైనట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. మహేశ్‌ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.  ప్రమాద విషయం తెలుసుకున్న ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు ఇప్పటికే ఆస్పత్రికి చేరుకున్నారు. మహేశ్‌ ఆరోగ్య పరిస్థితి గురించి ఆయన స్నేహితులు ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని