Katrina Kaif: విద్యార్థులతో కత్రినా కైఫ్‌ డ్యాన్స్‌.. సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా!

తమిళనాడు మధురైలోని మౌంటెన్‌ వ్యూ స్కూల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో బాలీవుడ్ నటి కత్రినా కైఫ్‌ సందడి చేశారు. విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు.

Published : 27 Sep 2022 01:41 IST

చెన్నై: తమిళనాడు మధురైలోని మౌంటెన్‌ వ్యూ స్కూల్‌లో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో బాలీవుడ్ నటి కత్రినా కైఫ్‌ (Katrina Kaif) సందడి చేశారు. విద్యార్థులతో కాసేపు ముచ్చటించిన అనంతరం ఆమె వాళ్లతో కలిసి ‘బీస్ట్‌’ సినిమాలోని ‘అరబిక్‌ కుతు’ పాటకు డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలను పలువురు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. బాలీవుడ్‌లో అగ్రకథానాయికగా రాణిస్తోన్న కత్రినా.. ఇలా చిన్నారులతో కలిసి డ్యాన్స్‌ చేయడాన్ని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ‘సింప్లిసిటీ అంటే ఇది’ ‘సో క్యూట్‌’, ‘మంచి మనసున్న నటి’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

పేద విద్యార్థులకు సైతం ఆంగ్ల మాధ్యమంలో బోధన అందించాలనే లక్ష్యంతో 2015లో మౌంటెన్‌ వ్యూ స్కూల్‌ని ప్రారంభించారు. ఆ పాఠశాలతో కత్రినా తల్లి సుజానెకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఆ స్కూల్‌లో కొన్నాళ్లు ఆమె పాఠాలు చెప్పారు. ఆ పాఠశాలలో మరిన్ని తరగతి గదులు ఏర్పాటు చేయడం కోసం సాయం చేయాలంటూ 2020లో కత్రినా తన అభిమానుల్ని కోరిన సంగతి తెలిసిందే. సినీ కెరీర్‌ చూస్తే.. ‘ఫోన్‌ భూత్‌’, ‘మెరీ క్రిస్మస్‌’, ‘టైగర్‌ 3’ చిత్రాలతో బిజీగా ఉంది కత్రినా. 




Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని