టైగర్‌ కోసం కత్రినా ప్రత్యేక శిక్షణ

యాక్షన్‌ సన్నివేశాలు చేయడం కత్రినాకైఫ్‌కు ఏమీ కొత్త కాదు. ఆమె శరీరం చాలా ఫిట్‌గా ఉంటుంది. నిత్యం

Published : 05 Mar 2021 13:15 IST

ముంబయి: యాక్షన్‌ సన్నివేశాలు చేయడం కత్రినాకైఫ్‌కు ఏమీ కొత్త కాదు. ఆమె శరీరం చాలా ఫిట్‌గా ఉంటుంది. నిత్యం కొత్త కొత్త వర్కవుట్లు చేస్తుంది. సల్మాన్‌ఖాన్‌, కత్రినాకైఫ్‌ జంట తెరపై ఎలా ఉంటుందో  అభిమానులు పలు   సినిమాల్లో చూశారు. ఈ జంట మరోసారి కలిసి నటిస్తున్న చిత్రం ‘టైగర్‌ 3’.

టైగర్‌ సిరీస్‌ వస్తోన్న ఈ చిత్రమూ యాక్షన్‌ సన్నివేశాలే కీలకంగా   సాగనుంది. అందులో భాగంగానే కత్రినా ప్రత్యేక కసరత్తులు చేస్తోంది. ఇందు కోసం ప్రత్యేకంగా 14 రోజుల పాటు దక్షిణ కొరియా స్టంట్‌ కళాకారుల నేతృత్వంలో శిక్షణ తీసుకోనుందట. మనీష్‌ శర్మ తెరకెక్కించనున్న ఈ సినిమా చిత్రీకరణ త్వరలోనే ముంబయిలో మొదలుకానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని