
Updated : 26 Jan 2022 07:11 IST
KatrinaKaif: పాట సాధనలో కత్రినా కైఫ్
విక్కీ కౌశల్‌ని వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని ఆస్వాదిస్తోంది కత్రినాకైఫ్. మరో పక్క నెమ్మదిగా సినిమాలపైనా దృష్టిపెట్టింది. కరోనా ప్రభావంతో కొన్ని రోజులుగా చిత్రీకరణలు ఆగిపోయాయి. వచ్చే నెల నుంచి కాస్త పరిస్థితులు అనుకూలించేలా ఉండటంతో చిత్రీకరణలు మొదలుపెట్టడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాయి కొన్ని చిత్రబృందాలు. కత్రినా తను నటిస్తున్న ‘ఫోన్ భూత్’ కోసం సిద్ధమవుతోంది. ఈ సినిమాలోని ఓ కీలకమైన పాటని త్వరలో చిత్రీకరించనున్నారు. యశ్‌రాజ్ స్టూడియోలో ఈ పాట కోసం సాధన చేస్తుంది కత్రిన. ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్న సిద్ధాంత్ చతుర్వేది, ఇషాన్ కట్టర్‌కూడా ఈ పాటలో ఆడిపాడనున్నారట. దీనికి గణేష్ హెగ్డే నృత్య దర్శకత్వం వహించనున్నారు
Tags :