Katrina Kaif: దక్షిణాది సినిమాల్లో చేయాలని ఉంది..: కత్రినా కైఫ్‌

బాలీవుడ్‌ ప్రముఖ కథానాయిక కత్రినా కైఫ్‌ పొన్నియిన్‌ సెల్వన్‌ పై ప్రశంసలు కురింపించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తనకు దక్షిణాది చిత్రాల్లో నటించాలని ఉందని తెలిపారు.

Published : 26 Oct 2022 16:08 IST

హైదరాబాద్‌‌: టాలీవుడ్‌లో మల్లీశ్వరీ, అల్లరి పిడుగు వంటి సినిమాలతో  అలరించింది బాలీవుడ్‌ అందాలతార కత్రినా కైఫ్‌(Katrina Kaif). తాజాగా తనకు దక్షిణాది సినిమాలు చేయాలని ఉందంటూ తన అభిప్రాయాన్ని పంచుకుంది. మణిరత్నం రూపొందించిన పొన్నియిన్‌ సెల్వన్‌(Ponniyin Selvan) చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించిన ఈ అమ్మడు ఇటీవల ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ..‘‘మంచి కథ, బలమైన పాత్రలు ఉంటే నాకు నటించడానికి భాష అడ్డం కాదు. నాకు సౌత్‌ఇండియన్‌ సినిమాలు చేయాలని ఉంది. దక్షిణ భారతదేశంలో చాలా మంది గొప్ప దర్శకులు ఉన్నారు. దానికి ఉదాహరణ ఇటీవల విడుదలైన పొన్నియిన్‌ సెల్వన్‌1. ఎంత అద్భుతమైన చిత్రం అది. అందులోని ప్రతి సన్నివేశాన్ని మణిరత్నం ఎంతో గొప్పగా తీశారు. ఆ సినిమా సంగీతం కూడ ఎంత బాగుందో. దర్శకుడు ఇంత పెద్ద స్థాయిలో సినిమా తీసి తన సత్తా నిరూపించుకున్నారు’’ అని చెప్పింది.

ప్రస్తుతం కత్రినా కైఫ్‌ ‘ఫోన్‌ భూత్‌’ (Phone Bhoot) సినిమాతో పలకరించనుంది.  భయానకమైన కామెడీ అనేది ఈ చిత్రానికి ఉపశీర్షిక. ఇందులో కత్రినా దెయ్యం పాత్రలో ప్రేక్షకులను అలరించనుంది. సిద్ధాంత్‌ చతుర్వేది, ఇషాన్‌ కట్టర్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ సినిమా నవంబర్‌4న థియేటర్లలోకి రానుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని