
Keeravani: ‘జెంటిల్‌మేన్ 2’కు కీరవాణి సంగీతం
విజయవంతమైన ‘జెంటిల్‌మేన్’కి కొన సాగింపుగా 27 ఏళ్ల తర్వాత మరో చిత్రం రూపొందుతోంది. ఈసారి మరో కొత్త బృందంతో చిత్రాన్ని రూపొందించేందుకు నిర్మాత కె.టి.కుంజుమన్ సన్నాహాలు మొదలు పెట్టారు. ఈ చిత్రానికి ఎమ్.ఎమ్.కీరవాణి స్వరాలు సమకూర్చనున్నట్టు ఆదివారం ప్రకటించారు నిర్మాత. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఎవరో సరిగ్గా ఊహిస్తే బహుమతిగా బంగారు నాణెం అందజేస్తానని ట్విటర్ ద్వారా ఇటీవలే ప్రకటించిన కుంజుమన్, ఆదివారం ‘జెంటిల్‌మేన్2’కి కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారని ప్రకటించారు. త్వరలోనే విజేతలకి బంగారు నాణెం అందజేస్తానని ఆయన తెలిపారు. అర్జున్, మధుబాల జంటగా నటించిన ‘జెంటిల్‌మేన్’ భారతదేశంలోని విద్యావ్యవస్థలోని లోపాల నేపథ్యంలో రూపొందిన విషయం తెలిసిందే. ఎ.ఆర్.రెహమాన్ స్వరాలు సమకూర్చారు. ‘జెంటిల్‌మేన్2’ చిత్రంలో ఎవరు నటిస్తారు, ఎవరు దర్శకత్వం వహిస్తారనేది తెలియాల్సి ఉంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.