పెళ్లి పీటలెక్కనున్న కీర్తి సురేశ్‌

గతేడాది లాక్‌డౌన్‌ సమయంలో చిత్రపరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు సింగిల్‌ జీవితానికి స్వస్తి పలికి.. వివాహబంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. త్వరలోనే ఆ జాబితాలోకి అగ్రకథానాయిక...

Updated : 14 Feb 2021 14:44 IST

హైదరాబాద్‌: గతేడాది లాక్‌డౌన్‌ సమయంలో చిత్రపరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు సింగిల్‌ జీవితానికి స్వస్తి పలికి.. వివాహబంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. త్వరలోనే ఆ జాబితాలోకి అగ్రకథానాయిక కీర్తిసురేశ్‌ సైతం చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘మహానటి’తో తెలుగువారి హృదయాలకు చేరువైన ఈ నటి‌ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారంటూ వరుస కథనాలు వస్తున్నాయి.

యువ సంగీత కెరటం, ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్‌తో కీర్తి గత కొన్నిరోజుల నుంచి ప్రేమలో ఉన్నారని.. త్వరలోనే వీరిద్దరూ తమ బంధాన్ని ఏడడుగుల వైపు తీసుకువెళ్లనున్నారని పలు ఆంగ్ల పత్రికల్లో, నెట్టింట్లో పోస్టులు దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలోనే వీరిద్దరూ పెద్దల సమక్షంలో ఈ ఏడాదిలోనే పెళ్లి చేసుకోనున్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే సదరు వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మరోవైపు కీర్తి సురేశ్‌ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. ‘గుడ్‌లక్‌ సఖి’, ‘రంగ్‌దే’, ‘సర్కారు వారి పాట’ చిత్రాలతోపాటు మరికొన్ని మలయాళీ, తమిళ సినిమాలు కీర్తి చేతిలో ఉన్నాయి. ‘సర్కారువారి పాట’ షూట్‌ కోసం దుబాయ్‌కు వెళ్లిన కీర్తి ఇటీవల ఇంటికి చేరుకున్నారు.

ఇదీ చదవండి..

సినిమాల్లో ప్రేమకు నిర్వచనాలు

రాధేశ్యామ్‌ టీజర్‌ వచ్చేసింది


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని