keerthy suresh: కీర్తి సురేశ్ పెళ్లిపై వార్తలు.. క్లారిటీ ఇచ్చిన తండ్రి
గత కొన్ని రోజులుగా కీర్తి సురేశ్ (keerthy suresh) పెళ్లిపై రూమర్స్ వస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై స్పందిస్తూ ఆమె తండ్రి ఓ వీడియో విడుదల చేశారు.
హైదరాబాద్: గత కొన్ని రోజుల నుంచి కీర్తి సురేశ్ పెళ్లిపై సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆమె తన ఫ్రెండ్‌తో దిగిన ఫొటో వైరల్‌గా మారడంతో.. కీర్తికి కాబోయ్ వరుడు అతడేనంటూ పలు వెబ్‌సైట్లలో వార్తలు వచ్చాయి. దీనిపై ఆమె స్పందిస్తూ అతడు తన స్నేహితుడని క్లారిటీ ఇచ్చింది. పెళ్లంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పింది. అయినా ఈ వార్తలు ఆగకపోవడంతో తాజాగా కీర్తి సురేశ్ తండ్రి సురేష్ కుమార్ (Suresh Kumar) ఈ విషయంపై స్పష్టతనిస్తూ ఓ వీడియో విడుదల చేశారు.
‘‘ఇటీవల కీర్తి సురేశ్ (keerthy suresh) తన ఫ్రెండ్‌తో దిగిన ఫొటోపై రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. ఆ అబ్బాయి కీర్తికి మాత్రమే కాదు.. మాకు కూడా తెలుసు. తన పేరు ఫర్హాన్ (Farhan). అతడి పుట్టినరోజు సందర్భంగా కీర్తి ఒక ఫొటో షేర్ చేసి అతడికి శుభాకాంక్షలు తెలిపింది. దీనిపై మొదట ఒక తమిళ మీడియా వార్తలు రాసింది. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే అన్నీ ఛానల్స్‌లో వార్తలు వచ్చాయి. కీర్తి సురేశ్‌కు పెళ్లి కుదిరితే మీడియాకు, ప్రజలకు ముందుగా మేమే చెబుతాం. ఇలాంటి సున్నితమైన విషయాలపై రూమర్స్ క్రియేట్ చేయొద్దు. దీని కారణంగా కుటుంబంలో మనశ్శాంతి కరవవుతుంది’’ అంటూ అసహనం వ్యక్తం చేశారు.
ఇక ఈ ఫొటోపై వస్తున్న వార్తలనుద్దేశిస్తూ కీర్తి సురేశ్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ‘‘ఈసారి నా బెస్ట్ ఫ్రెండ్‌ను ఈ వార్తల్లోకి లాగారా. (కాబోయే వరుడిని ఉద్దేశిస్తూ) నిజమైన మిస్టరీ మ్యాన్‌ను సమయం వచ్చినప్పుడు తప్పకుండా పరిచయం చేస్తాను. అప్పటివరకూ చిల్‌గా ఉండండి. ఒక్కసారి కూడా సరైన వార్తలను ప్రచారం చేయరు’’ అని అందులో పేర్కొంది. ప్రస్తుతం ఈ అమ్మడు ‘భోళా శంకర్’ (Bhola Shankar)లో మెగాస్టార్ చిరంజీవి (chiranjeevi) చెల్లిగా నటిస్తోంది. దీనితో పాటు ‘రఘు తాత’ (Raghu Thatha)లోనూ కనిపించనుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Amazon Prime Video: అమెజాన్ ప్రైమ్ చందాదారులా? అయితే, ఈ విషయం తెలుసా?
-
Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌లో ప్రభాస్‌తో పాటు ఆ స్టార్ హీరోయిన్!
-
IND vs AUS: ఆసీస్‌తో రెండో వన్డే.. శ్రేయస్ అయ్యర్‌కు ఇదేనా చివరి ఛాన్స్..?
-
Vizag: సిగరెట్ కోసం స్నేహితుడినే హతమార్చారు!
-
social look: అనుపమ ఉవాచ.. రష్మిక ఫస్ట్‌లుక్.. ఇంకా ఎన్నో ముచ్చట్లు..
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/09/2023)