keerthy suresh: ‘దసరా’ కోసం ఐదురోజులు డబ్బింగ్ చెప్పా: కీర్తిసురేశ్
keerthy suresh: నాని కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘దసరా’. కీర్తి సురేశ్ కథానాయిక. మార్చి 30న సినిమా విడుదల నేపథ్యంలో కీర్తి పంచుకున్న కబుర్లు...
నాని కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘దసరా’. శ్రీకాంత్ ఓదెల దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా కీర్తి సురేశ్ అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
‘దసరా’లో మీ పాత్ర ఏంటి? కష్టంగా అనిపించిందా?
కీర్తి సురేశ్: ‘దసరా’లో నేను పోషించిన వెన్నెల పాత్ర సవాల్‌తో కూడుకున్నది. మేకప్ వేయడానికి, తీయడానికి కూడా కొన్ని గంటలు పట్టేది. దుమ్ము , బొగ్గు ఇలా రస్టిక్ బ్యాగ్ డ్రాప్‌లో షూట్ చేశాం. మొదట కష్టం అనిపించిది. నా కెరీర్‌లో పోషించిన ఓ ఛాలెజింగ్ రోల్ ఇది. వెన్నెల అనే పాత్ర అందరికీ కనెక్ట్ అవుతుంది.
తెలంగాణ యాస మాట్లాడటం ఎలా అనిపించింది ?
కీర్తి సురేశ్: దర్శకుడు శ్రీకాంత్ ఓదెల అసోసియేట్ శ్రీనాథ్ నాకు తెలంగాణ యాస నేర్పించారు. ఆయనకి మొత్తం యాస మీద పట్టుంది. దసరాకి నేనే డబ్బింగ్ చెప్పా. మాములుగా అయితే రెండు లేదా మూడు రోజులు డబ్బింగ్ చెబుతా. కానీ దసరాకి మాత్రం ఐదారురోజులు పట్టింది.
‘మహానటి’కి జాతీయ అవార్డ్ వచ్చింది కదా.. దసరాకి కూడా వస్తుందని భావిస్తున్నారా ?
కీర్తి సురేశ్: నేనేం ఆశించడం లేదు. నిజానికి మహానటి కూడా ఆశించలేదు. అందరి ఆశీస్సులతో అది వచ్చింది. సినిమా బాగా ఆడాలి, అందరూ వారి బెస్ట్ వర్క్‌ని ఇవ్వాలని మాత్రమే అనుకుంటాను. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ కథని అద్భుతంగా రాసుకున్నారు. ఏ పాత్ర ఎలా ఉండాలో ఆయనకి చాలా క్లారిటీ ఉంది. దానిపై వర్క్ చేశాం.
నేను లోకల్ తర్వాత నానితో పని చేయడం ఎలా అనిపించిది ?
కీర్తి సురేశ్: నానితో ‘నేను లోకల్’ తర్వాత ఇలాంటి పాత్ర కోసం చాలా వెయిట్ చేసిన సినిమా దసరా. నానితో చాలా కాలం తర్వాత కలసి పని చేయడం చాలా ఆనందాన్నిచ్చింది. వెన్నెల చాలా డిఫరెంట్ క్యారెక్టర్. ఇలాంటి కథ కోసం చాలా కాలంగా ఎదురుచూశాను.
చమ్కీల అంగీలేసుకొని పాట ఇంత పాపులర్ అవుతుందని ముందే అనుకున్నారా ?
కీర్తి సురేశ్: ఆ పాట వినగానే అన్ని పెళ్లిల్లో ఇదే పాట మార్మోగుతుందని అనుకున్నాం. పాటలో ఆ వైబ్ ఉంది. లిరిక్స్ చాలా అందంగా ఉంటాయి. అప్పుడే పెద్ద హిట్ అవుతుందని అనుకున్నాం. మేము ఊహించిన దాని కంటే పెద్ద విజయం సాధించింది.
బాలీవుడ్‌కు వెళ్లే ఆలోచన లేదా?
కీర్తి సురేశ్: కొన్ని కథలు విన్నాను. కానీ బలమైన పాత్ర అనిపించలేదు. ఇప్పుడు దసరా పాన్ ఇండియాగా విడుదలవుతుంది కాబట్టి బలమైన పాత్రలు వస్తాయో చూడాలి. నాకు మాత్రం చేయాలనే ఉంది. అయితే ముందు మంచి పాత్రలు, కథలు కుదరాలి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
రూ.99కే కొత్త సినిమా.. విడుదలైన రోజే ఇంట్లో చూసే అవకాశం
-
Sports News
ఎంతో భావోద్వేగానికి గురయ్యా.. మరోసారి అలాంటి బాధ తప్పదనుకున్నా: సీఎస్కే కోచ్
-
World News
Flight Passengers: బ్యాగేజ్‌తో పాటు ప్రయాణికుల శరీర బరువూ కొలవనున్న ఎయిర్‌లైన్స్ సంస్థ!
-
India News
Mahindra - Dhoni: ధోనీ రాజకీయాల గురించి ఆలోచించాలి.. ఆనంద్ మహీంద్రా ట్వీట్
-
Sports News
MS Dhoni : మైదానాల్లో ధోనీ మోత మోగింది.. ఆ శబ్దం విమానం కంటే ఎక్కువేనట..
-
Crime News
ప్రియుడితో భార్య పరారీ.. స్టేషన్‌కు భర్త బాంబు బెదిరింపు ఫోన్‌కాల్!