Keerthy Suresh: నా మైండ్‌ బ్లాంక్‌ అయిపోయింది

‘‘ఓవైపు   కమర్షియల్‌ సినిమాలు.. మరోవైపు నాయికా ప్రాధాన్య చిత్రాలు.. రెండింటినీ సమంగా బ్యాలెన్స్‌ చేసుకుంటూ ముందుకెళ్లడమంటేనే నాకిష్టం’’ అంటోంది నటి కీర్తి సురేష్‌.

Updated : 16 Jun 2022 08:21 IST

‘‘ఓవైపు   కమర్షియల్‌ సినిమాలు.. మరోవైపు నాయికా ప్రాధాన్య చిత్రాలు.. రెండింటినీ సమంగా బ్యాలెన్స్‌ చేసుకుంటూ ముందుకెళ్లడమంటేనే నాకిష్టం’’ అంటోంది నటి కీర్తి సురేష్‌. ‘మహానటి’తో నాయికా ప్రాధాన్య చిత్రాలకు చిరునామాగా మారిన ఈ అమ్మడు.. ఒకానొక సమయంలో వరుసగా అదే తరహా చిత్రాలతో ప్రేక్షకుల్ని పలకరించింది. మధ్యలో కమర్షియల్‌ చిత్రాలు తగ్గించడానికి కారణాలేంటని ప్రశ్నించగా.. తాను కావాలని తగ్గించలేదని బదులిచ్చింది. ‘‘ప్రత్యేకంగా ఇలాంటి కథలతోనే ముందుకెళ్లాలని నేనెప్పుడూ పరిమితులు పెట్టుకోలేదు. అయితే ‘మహానటి’ తర్వాత నా మైండ్‌ కాస్త బ్లాంక్‌ అయిపోయింది. ఆ సమయంలో వరుసగా నాయికా ప్రాధాన్య కథలు రావడంతో వాటితోనే ముందుకెళ్లిపోయా. ఇప్పుడు మళ్లీ వరుసగా కమర్షియల్‌ సినిమాలొస్తున్నాయి. ఈ మధ్యే ‘సర్కారు వారి పాట’తో వచ్చా. ఇప్పుడు ‘దసరా’, ‘భోళా శంకర్‌’ వంటి కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌లు చేస్తున్నా. మంచి కథలు వస్తే మళ్లీ నాయికా ప్రాధాన్య కథలు చేస్తా’’ అంది కీర్తి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని