Keerthy Suresh: ‘దసరా’ ట్రెండింగ్ పాట.. అల్లుడితో కలిసి కీర్తి తల్లి అదరగొట్టేలా డ్యాన్స్
‘దసరా’ ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా పాల్గొంటున్నారు నటి కీర్తి సురేశ్ (Keerthy suresh). ఈనేపథ్యంలోనే కీర్తికి వాళ్లమ్మ మేనక చిన్న సర్‌ప్రైజ్ ఇచ్చారు. ‘దసరా’ లోని ‘చమ్కీల అంగిలేసి’ పాటకు డ్యాన్స్ చేశారు.
ఇంటర్నెట్‌డెస్క్: ‘చమ్కీల అంగిలేసి’.. ప్రస్తుతం సోషల్‌మీడియాలో ఎక్కడ విన్నా ఇదే పాట వినిపిస్తోంది. నాని (Nani) - కీర్తి సురేశ్ (Keerthy Suresh) జంటగా నటించిన ‘దసరా’ (Dasara) సినిమాలోని ఈ పాటకు రీల్స్ చేసేందుకు చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు. ఇందులో భాగంగానే నటి కీర్తి సురేశ్ అమ్మ, అలనాటి నటి మేనక (menaka) సైతం ఈ పాటకు కాలు కదిపారు. కుమార్తె మాదిరిగానే అదిరిపోయేలా స్టెప్పులేశారు. ఈ వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేసిన ఆమె ట్రెండ్‌కు అనుగుణంగానే దీనిని క్రియేట్ చేసినట్లు పేర్కొన్నారు. మరోవైపు, కీర్తి సోదరి భర్త సైతం ఈ పాటకు డ్యాన్స్ చేశాడు. మేనకతో కలిసి అతడు ‘చమ్కీల అంగిలేసి’ తమిళ వెర్షన్‌కు స్టెప్పులు వేశాడు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. వీటిని చూసిన కీర్తి ఆనందం వ్యక్తం చేశారు.
కీర్తి కొత్త స్నేహితులు:
యాక్షన్, ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తి (Keerthy Suresh) వెన్నెల అనే గ్రామీణ యువతి పాత్రలో నటించారు. ఈ నేపథ్యంలో ఆమె తన కొత్త స్నేహితులను పరిచయం చేస్తూ ఓ పోస్ట్ పెట్టారు. ఇందులో ఆమె ఆవులు, కోడిపిల్లలు, మేకలతో సరదాగా ఆడుతూ కనిపించారు. ఇది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
నా మెదడు సీసీ టీవీ ఫుటేజ్ లాంటిది
-
Sports News
రంగు రంగుల రబ్బరు బంతులతో.. టీమ్ఇండియా క్యాచ్‌ల ప్రాక్టీస్
-
Movies News
Kota Srinivas Rao: హీరోల పారితోషికం బయటకు చెప్పటంపై కోట మండిపాటు!
-
Sports News
Sehwag: ఆ ఓటమి బాధతో రెండు రోజులు హోటల్ రూమ్ నుంచి బయటికి రాలేదు: వీరేంద్ర సెహ్వాగ్
-
Movies News
Social Look: అనూ అవకాయ్.. సారా స్టెప్పులు.. బీచ్‌లో రకుల్
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/06/2023)