Keerthy Suresh: ‘గాంధారి’గా రాబోతున్న కీర్తి సురేశ్‌!

గ్లామరస్‌ పాత్రలతో పాటు మహిళా ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది కీర్తి సురేశ్‌. ఆమె గత సినిమాలు కాస్త నిరాశపర్చినా.. ప్రస్తుతం ఆమె చేతుల్లో చాలా ప్రాజెక్టులున్నాయి. మెగాస్టార్‌ చిరంజీవి చిత్రం ‘భోళా శంకర్‌’లో ఆయనకు చెల్లెలిగా నటిస్తోంది. ‘దసరా’ చిత్రంలో

Updated : 20 Feb 2022 19:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గ్లామరస్‌ పాత్రలతో పాటు మహిళా ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది కీర్తి సురేశ్‌.  ప్రస్తుతం ఆమె చేతుల్లో చాలా ప్రాజెక్టులున్నాయి. మెగాస్టార్‌ చిరంజీవి చిత్రం ‘భోళా శంకర్‌’లో ఆయనకు చెల్లెలిగా నటిస్తోంది. ‘దసరా’ చిత్రంలో నానికి జోడిగా రెండోసారి కనిపించబోతుంది. మలయాళంలోనూ ఓ చిత్రంలో నటిస్తోంది. తాజాగా కీర్తి.. ‘గాంధారి’ అనే ఒక మ్యూజిక్‌ వీడియో ఆల్బమ్‌లోనూ నర్తించింది. ఈ ఆల్బమ్‌ను ఫిబ్రవరి 21న విడుదల చేయనున్నట్లు తాజాగా ఆమె ట్విటర్‌ వేదికగా వెల్లడించింది. దాంతోపాటు ‘గాంధారి’ మ్యూజిక్‌ ఆల్బమ్‌కు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో కీర్తి.. చేతికి గోరింటాకుతో, సంప్రదాయ దుస్తుల్లో అందంగా కనిపిస్తోంది. 

ఈ మ్యూజిక్‌ వీడియో ఆల్బమ్‌ను దీ రూట్‌, సోనీ మ్యూజిక్‌ సౌత్‌ సంయుక్తంగా నిర్మించాయి. ‘లవ్‌స్టోరీ’ సంగీత దర్శకుడు పవన్‌ సీహెచ్‌ దీనికి సంగీతం అందించారు. బృందా మాస్టర్‌ నృత్యాలు సమకూర్చారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని