Keerthy Suresh: ‘మహానటి’ని అంగీకరించినందుకు ట్రోల్స్ ఎదుర్కొన్నా: కీర్తిసురేశ్
‘దసరా’ (Dasara) ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా పాల్గొంటున్నారు నటి కీర్తిసురేశ్ (Keerthy Suresh). తాజాగా ఓ బాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె ‘మహానటి’ రోజులను గుర్తు చేసుకున్నారు.
హైదరాబాద్: ‘మహానటి’ (Mahanati) ప్రాజెక్ట్‌ని అంగీకరించినందుకు తాను ట్రోల్స్ ఎదుర్కొన్నట్లు చెప్పారు నటి కీర్తిసురేశ్ (Keerthy Suresh). అయితే, ఆ సినిమా పూర్తయ్యాకే తనపై విమర్శల వచ్చాయని తెలిసిందని ఆమె అన్నారు. సవాళ్లు, విమర్శలు.. అన్నింటినీ పక్కన పెడితే ఆ పాత్ర చేసినందుకు తాను గర్వపడుతున్నట్లు చెప్పారు. ‘దసరా’ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని బయటపెట్టారు.
‘‘మహానటి’కి నేను తొలుత నో చెప్పాను. సావిత్రమ్మ పాత్రలో నటించడానికి ఎంతో భయపడ్డాను. కానీ, దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) నన్ను ఎంతో ప్రోత్సహించారు. ‘ఇది నువ్వు చేయగలవు’ అని ధైర్యనిచ్చారు. ఆయనే నన్ను అంతగా నమ్మినప్పుడు.. నన్ను నేనెందుకు నమ్మకూడదనుకున్నా. అలా ప్రాజెక్ట్ పూర్తి చేశా. అయితే, ఆ పాత్రను అంగీకరించినందుకు కొంతమంది నన్ను ట్రోల్ చేశారు. అది నాకు తెలియదు. ఆ సినిమా ప్రమోషన్స్‌లో ఉన్నప్పుడు.. ‘మీపై వస్తోన్న విమర్శల గురించి స్పందించగలరు’ అని విలేకర్లు అడిగారు. అప్పుడే నాక్కూడా ఈ ట్రోల్స్ గురించి తెలిసింది. సోషల్‌మీడియాలో వచ్చే నెగెటివిటీపై నేను అంతగా ఆసక్తి చూపించను. అందుకే ట్రోల్స్, విమర్శలు నా వరకూ రావు. ఇక ‘మహానటి’ అప్పుడు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాను. సావిత్రమ్మకు విపరీతమైన ప్రేక్షకాదరణ ఉంది. ఆమె బయోపిక్‌లో నటించడం భయంగా అనిపించింది. ఆమె కుమార్తెతో మాట్లాడి ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. సవాళ్లు, విమర్శలు ఉన్నప్పటికీ ఆ పాత్ర చేసినందుకు సంతోషంగా ఉన్నా’’ అని కీర్తి సురేశ్ (Keerthy Suresh) వివరించారు. బాలీవుడ్ ఎంట్రీపై స్పందిస్తూ.. మంచి కథ వస్తే తప్పకుండా బాలీవుడ్‌లోనూ యాక్ట్ చేస్తానన్నారు. ‘దసరా’లో తాను పోషించిన వెన్నెల పాత్రతో అబ్బాయిలందరూ ప్రేమలో పడతారని కీర్తి (Keerthy Suresh) తెలిపారు.
‘సర్కారు వారి పాట’ తర్వాత కీర్తి నుంచి నటిస్తున్న చిత్రమిది. నాని (nani) కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. ఇందులో ఆమె వెన్నెల అనే గ్రామీణ యువతి పాత్రలో నటించారు. మార్చి 30న ఇది పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Intresting News: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Jawan: ‘జవాన్’ ఆఫర్.. ఒక టికెట్ కొంటే మరొకటి ఫ్రీ.. ఆ మూడు రోజులే!
-
Pakistan-New Zealand: హైదరాబాద్ చేరుకున్న పాకిస్థాన్, న్యూజిలాండ్ క్రికెట్ జట్లు
-
Amaravati: ఏపీ సచివాలయంలో 50 మంది అసిస్టెంట్ సెక్రటరీలకు రివర్షన్
-
Law Commission: ‘జమిలి’ నివేదికపై కసరత్తు జరుగుతోంది.. లా కమిషన్ ఛైర్మన్
-
IND vs AUS: టీమ్ఇండియా ఆలౌట్.. మూడో వన్డేలో ఆస్ట్రేలియా విజయం