మూడు, నాలుగు పెళ్లిళ్లు చేసేశారు: కీర్తిసురేశ్‌

తన పెళ్లి గురించి గత కొంతకాలంగా నెట్టింట్లో వస్తోన్న పోస్టులు, ఫొటోలను చూసి తాను షాకయ్యానని అగ్రకథానాయిక కీర్తిసురేశ్‌ అన్నారు. ఇటీవల ‘రంగ్‌ దే’ ప్రమోషన్‌లో పాల్గొన్న ఆమె తన పెళ్లి గురించి స్పందించారు....

Updated : 31 Mar 2021 17:12 IST

హైదరాబాద్‌: తన పెళ్లి గురించి గత కొంతకాలంగా నెట్టింట్లో వస్తోన్న పోస్టులు, ఫొటోలను చూసి తాను షాకయ్యానని అగ్రకథానాయిక కీర్తిసురేశ్‌ అన్నారు. ఇటీవల ‘రంగ్‌ దే’ ప్రమోషన్‌లో పాల్గొన్న ఆమె తన పెళ్లి గురించి స్పందించారు. సమయం వచ్చినప్పుడు తప్పకుండా వివాహబంధంలోకి అడుగుపెడతానని ఆమె అన్నారు. ‘నా పెళ్లి గురించి చాలా సందర్భాల్లో నెట్టింట్లో పోస్టులు, ఫొటోలు దర్శనమిచ్చాయి. వాటిని చూసి షాకయ్యాను. కొంతమంది నెటిజన్లు సోషల్‌మీడియా వేదికగా ఇప్పటికే, మూడు, నాలుగుసార్లు నాకు పెళ్లి చేసేశారు. మొదట వాటిని చూసి షాక్‌ అయ్యాను. తర్వాత నవ్వుకున్నాను. కానీ, ఒక్కటి మాత్రం పక్కా చెప్పగలను.. నా పెళ్లికి ఇంకా చాలా సమయం ఉంది. సరైన సమయం వచ్చినప్పుడు తప్పకుండా వివాహం చేసుకుంటా.’ అని కీర్తి సురేశ్‌ తెలిపారు.

నితిన్‌ కథానాయకుడిగా నటించిన యూత్‌ఫుల్‌ లవ్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘రంగ్‌దే’. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. కీర్తి సురేశ్‌ కథానాయిక. ఇందులో నితిన్‌ సతీమణిగా కీర్తి నటించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటోంది. మరోవైపు, కీర్తిసురేశ్‌  ‘సర్కారువారి పాట’ కోసం మహేశ్‌తో ఆడిపాడనున్నారు.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని