Keerthy Suresh: తన లైఫ్‌లో మిస్టరీ మ్యాన్‌.. తొలిసారి స్పందించిన కీర్తిసురేశ్‌

తన పెళ్లి గురించి జరుగుతోన్న ప్రచారంపై నటి కీర్తిసురేశ్‌ (Keerthy Suresh) తాజాగా స్పందించారు. సమయం వచ్చినప్పుడు తప్పకుండా కాబోయే వాడిని పరిచయం చేస్తానని అన్నారు.

Published : 22 May 2023 16:11 IST

హైదరాబాద్‌: తన లైఫ్‌లో ఓ మిస్టరీ మ్యాన్‌ ఉన్నాడంటూ గత కొన్నిరోజుల నుంచి వస్తోన్న వార్తలపై తాజాగా నటి కీర్తిసురేశ్‌ (Keerthy Suresh) స్పందించారు. అలాంటి వారెవరూ ప్రస్తుతానికి తన జీవితంలో లేరని ఆమె తెలిపారు. ఈ మేరకు సోమవారం ఓ ట్వీట్‌ చేశారు. ‘‘హ్హహ్హహ్హ.. ఈసారి నా బెస్ట్‌ ఫ్రెండ్‌ను ఈ వార్తల్లోకి లాగారా. (కాబోయే వరుడిని ఉద్దేశిస్తూ) నిజమైన మిస్టరీ మ్యాన్‌ను సమయం వచ్చినప్పుడు తప్పకుండా పరిచయం చేస్తాను. అప్పటివరకూ చిల్‌గా ఉండండి. (వివాహాన్ని ఉద్దేశిస్తూ) ఒక్కసారి కూడా సరైన వార్తలు రాలేదు’’ అని బదులిచ్చారు.

కీర్తిసురేశ్‌ పెళ్లి పీటలెక్కనున్నారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. యువ సంగీత దర్శకుడితో ఆమె ప్రేమలో ఉందని గతంలో వార్తలు రాగా, అవన్నీ వదంతులు మాత్రమేనని కీర్తి తల్లి మేనక క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఆమె ఓ వ్యాపారవేత్తను వివాహం చేసుకోనున్నారని ప్రచారం జరిగింది. ఓ వ్యక్తితో కలిసి కీర్తి సురేశ్‌ దిగిన ఫొటో సైతం ఇటీవల నెట్టింట వైరల్‌గా మారింది. దీనిని ఉద్దేశిస్తూ ‘మిస్టరీ మ్యాన్‌తో కీర్తిసురేశ్‌ వివాహం’, ‘కీర్తిసురేశ్‌ లైఫ్‌లో ఉన్న ఆ మిస్టరీ మ్యాన్‌ ఎవరో తెలుసా?’ అంటూ పలు వెబ్‌సైట్లలో కథనాలు ప్రచురితమయ్యాయి. అలా వచ్చిన ఓ కథనంపై తాజాగా ఆమె స్పందించారు. ఆ ఫొటోలో ఉన్న వ్యక్తి తన బెస్ట్‌ ఫ్రెండ్‌ మాత్రమేనని తెలిపారు. పెళ్లి ఫిక్స్‌ కాగానే కాబోయే భర్తను పరిచయం చేస్తానని వివరించారు.

ఇక, సినిమాల విషయానికి వస్తే.. ‘దసరా’తో ఈ ఏడాది సూపర్‌ సక్సెస్‌ను అందుకున్నారు కీర్తిసురేశ్‌. ప్రస్తుతం ఆమె.. ‘భోళా శంకర్‌’, ‘రివాల్వర్‌ రీటా’, ‘రఘు తాత’ చిత్రాల్లో నటిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు