Updated : 24 Jan 2022 11:02 IST

keerthy suresh: ‘నేను నిజంగానే బ్యాడ్‌లక్‌ సఖి’: కీర్తి సురేశ్‌

హైదరాబాద్‌: ‘‘నేను నిజంగానే బ్యాడ్‌లక్‌ సఖి’’ అని అంటున్నారు కథానాయిక కీర్తిసురేశ్‌. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గుడ్‌ లక్‌ సఖి’. క్రీడా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి నగేష్‌ కుకునూరు దర్శకత్వం వహించారు. మరి కొన్నిరోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం ‘గుడ్‌లక్‌ సఖి’ ట్రైలర్‌ను చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా పంచుకొంది. ‘‘మన దేశం గర్వపడేలా షూటర్స్‌ని తయారు చేయబోతున్నాను’’ అని జగపతిబాబు చెప్పే డైలాగ్‌లతో ప్రారంభమైన ట్రైలర్‌ ఆద్యంతం ఆకట్టుకొనేలా సాగింది. ‘‘అందరూ నన్ను బ్యాడ్‌లక్‌ సఖి అంటుంటారు. మనకి అటాంటి సోది కబుర్లు మీద నమ్మకం లేదు’’ అంటూ కీర్తిసురేశ్‌ చెప్పే డైలాగ్‌లు, ఆమె నటన మెప్పిస్తోంది.

షూటింగ్‌ ప్రధానాంశంగా సాగే ఈ కథలో కీర్తిసురేశ్‌ ‘సఖి’ అనే గ్రామీణ యువతి పాత్ర పోషించారు. ఆమెకు శిక్షణ ఇచ్చే వ్యక్తిగా జగపతిబాబు కనిపించనున్నారు. తన గ్రామంలో ఉన్న వారందరి చేత బ్యాడ్‌లక్‌ సఖిగా పిలిపించుకున్న ఆమె దేశవ్యాప్తంగా ఎలా గుర్తింపు తెచ్చుకున్నారు? ఆమె జీవితం ఎలాంటి మలుపులు తీసుకుంది? అనే ఆసక్తికర అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 28న థియేటర్లలో విడుదల కానుంది. దేవిశ్రీ ప్రసాద్‌ ఈ చిత్రానికి స్వరాలు అందించారు.


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని