Keerthy Suresh: పూర్వీకుల ఇంటికి వెళ్లిన కీర్తిసురేశ్‌.. శ్రియ స్పందనేంటంటే?

కీర్తి సురేశ్‌ తన తిరునల్వేలి జిల్లాలోని పూర్వీకుల ఇంటిని, అక్కడి  ఓ పురాతన దేవాలయాన్ని సందర్శించింది. ఆ వివరాలివీ..

Updated : 23 Nov 2022 18:51 IST

చెన్నై: సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉండే నటి కీర్తిసురేశ్‌ (Keerthy Suresh) ఇటీవల కొంత విరామం తీసుకున్నారు. ఆ బ్రేక్‌ టైమ్‌ ఎప్పటికీ గుర్తుండిపోవాలనుకున్నారు. అందుకే ఏ బీచ్‌కో, ఏ పబ్‌కో వెళ్లకుండా కన్యాకుమారి సమీపంలోని తిరుక్కురుంగుడిలో ఉన్న తన పూర్వీకుల ఇంటికి వెళ్లారు. వారితో సరదాగా ముచ్చటించారు. తర్వాత, అదే ఊరిలోని 8వ శతాబ్దానికి చెందిన వైష్ణవనంబి దేవాలయాన్ని సందర్శించారు. సంబంధిత దృశ్యాలను సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ‘‘నా పూర్వీకుల ఇంటికి రావడం, పురాతన ఆలయాన్ని సందర్శించడం సంతోషంగా ఉంది. పాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. ఈ గుడి నిర్మాణపరంగా అద్భుతంగా ఉండటమేకాదు మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది’’ అని ఆమె పేర్కొన్నారు. దీనిపై పలువురు సినీ తారలు, నెటిజన్లు ‘సూపర్‌’ అంటూ కామెంట్‌ పెడుతున్నారు. కీర్తిసురేశ్‌ షేర్‌ చేసిన దృశ్యాలపై మనసు పారేసుకున్న నటి శ్రియ ‘‘నన్నూ మా వారినీ తీసుకెళ్లండి. ఆ ప్లేస్‌ను చూడాలనుంది’’ అని కామెంట్‌ పెట్టగా అభిమానులు రిప్లై ఇస్తున్నారు.

సినిమాల విషయానికొస్తే.. ఈ ఏడాది ‘గుడ్‌లక్‌ సఖి’, ‘సాని కాయిదం’ (చిన్ని), ‘సర్కారువారి పాట’ తదితర చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు కీర్తి. ప్రస్తుతం ఆమె నాని సరసన ‘దసరా’, చిరంజీవి సోదరిగా ‘భోళా శంకర్‌’లో నటిస్తున్నారు. తమిళంలో రెండు చిత్రాలు చేస్తున్నారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని