Kantara: ‘వరాహరూపం’ పాటపై నిషేధం ఎత్తివేసిన కేరళ కోర్టు

‘వరాహరూపం’ పాట అభిమానులకు ఒక శుభవార్త. తెయ్యుకుడుం బ్రిడ్జ్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను కేరళలోని కోలికోడ్‌ జిల్లా కోర్టు కొట్టివేసింది.

Published : 25 Nov 2022 18:17 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రిషబ్‌శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌ బస్టర్‌ చిత్రం ‘కాంతార’ (Kantara). బాక్సాఫీస్‌ వద్ద రూ.400 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా ఇప్పుడు అమెజాన్‌ప్రైమ్‌ వీడియో వేదికగా స్ట్రీమింగ్‌ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే, క్లైమాక్స్‌లో ‘వరాహరూపం’ పాట ఒరిజినల్‌ వెర్షన్‌ కాకుండా ట్యూన్‌ మార్చి అందుబాటులోకి తీసుకురావడంపై థియేటర్‌లో సినిమా చూసిన వాళ్లే కాదు, యూట్యూబ్‌లో ఆ పాట విన్నవాళ్లు సైతం పెదవి విరుస్తున్నారు.

ఈ క్రమంలో ‘వరాహరూపం’ పాట అభిమానులకు ఒక శుభవార్త. తెయ్యుకుడుం బ్రిడ్జ్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను కేరళలోని కోలికోడ్‌ జిల్లా కోర్టు కొట్టివేసింది. తమ ట్యూన్‌ కాపీ చేశారంటూ హోంబాలే ఫిల్మ్స్‌పై కేరళలోని తెయ్యుకుడుం బ్రిడ్జ్‌ మ్యూజిక్‌ బ్యాండ్‌ కోర్టును ఆశ్రయించింది. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు, ‘కాంతార’ చిత్ర బృందానికి అనుకూలంగా తీర్పునిచ్చింది. మ్యూజిక్‌ బ్యాండ్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. పాటపై నిషేధం ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. దీనిపై ‘కాంతార’ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే, కేరళ పాలక్కడ్‌ జిల్లా కోర్టులో కూడా ఒక పిటిషన్‌ దాఖలై ఉంది. మరి దానిపై ఎప్పుడు విచారణ చేస్తారు? అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు కొలికోడ్‌ కోర్టు సానుకూల తీర్పు ఇచ్చి నేపథ్యంలో చిత్ర బృందం ఒరిజనల్‌ పాటను అమెజాన్‌ స్ట్రీమింగ్‌లో జత చేస్తుందో లేదో చూడాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని