Kerala Crime Files: లాడ్జ్‌లో హత్య.. ఒకే ఒక క్లూ.. ‘కేరళ క్రైమ్ ఫైల్స్’ ట్రైలర్
Kerala Crime Files: ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ+హాట్‌స్టార్ మలయాళంలో నిర్మించిన తొలి వెబ్‌సిరీస్ ట్రైలర్ విడుదలైంది.
హైదరాబాద్: ‘వాడు మనం అనుకుంటున్న టైపు కాదు మనోజ్.. ఈ కేసును మనం అనుకున్న విధంగా పూర్తి చేయలేం’ అంటున్నారు మలయాళ నటుడు లాల్. అజు వర్గీస్‌తో కలిసి ఆయన నటించిన తాజా వెబ్‌సిరీస్ ‘కేరళ క్రైమ్ ఫైల్స్’ (Kerala Crime Files). అహ్మద్ కబీర్ దర్శకుడు. ప్రముఖ ఓటీటీ వేదికగా డిస్నీ+హాట్‌స్టార్ మలయాళంలో నిర్మిస్తున్న తొలి వెబ్‌సిరీస్ ఇది. లాడ్జ్‌లో జరిగిన హత్యను ఛేదించడానికి రంగంలోకి దిగిన ఆరుగురు పోలీస్ అధికారులు ఏం చేశారు? షిజు, పరయల్ వీడు, నీందకర అనే క్లూను వాళ్లు ఎలా ఛేదించారు? తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే. ఇప్పటికీ చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సిరీస్ డిస్నీ+హాట్‌స్టార్ వేదికగా జూన్ 23 నుంచి స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు, తెలుగు, తమిళ, కన్నడ, బెంగాలీ, మరాఠీ భాషల్లో స్ట్రీమింగ్‌కానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.