Kevvu Karthik: కాబోయే సతీమణిని పరిచయం చేసిన జబర్దస్త్‌ కమెడియన్‌

‘జబర్దస్త్‌’ నటుడు కెవ్వు కార్తిక్‌ (Kevvu Karthik) త్వరలో పెళ్లి చేసుకోనున్నారు. తనకు కాబోయే సతీమణి ఫొటోలను తాజాగా ఆయన ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశారు.

Published : 04 Jun 2023 14:34 IST

హైదరాబాద్‌: జబర్దస్త్‌ కమెడియన్‌, కెవ్వు కార్తిక్‌(Kevvu Karthik)గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు కార్తిక్‌ త్వరలో వివాహం చేసుకోనున్నారు. ఈ మేరకు తాజాగా ఆయన తనకు కాబోయే సతీమణిని పరిచయం చేశారు. ‘‘పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటే అప్పట్లో నేను నమ్మలేదు. కానీ, ఇప్పుడు అది నిజమేననిపిస్తుంది. ఇద్దరు వ్యక్తులు, రెండు జీవితాలు, భిన్నాభిప్రాయాలు, విభిన్నమైన ప్రపంచాలు.. ఒక్కటిగా కలిసి కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టడం ఆనందంగా ఉంది. ఫైనల్‌గా నా జీవిత భాగస్వామి సిరిని పరిచయం చేసే సమయం ఆసన్నమైంది’’ అంటూ ఆమెతో దిగిన పలు ఫొటోలను ఆయన్‌ ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశారు.

‘జబర్దస్త్‌’తో కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న కార్తిక్‌.. పలు సినిమాల్లోనూ నటించారు. గతేడాది విడుదలైన ‘ముఖచిత్రం’, ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘నేను స్టూడెంట్‌ సర్‌’ చిత్రాలతో ఆయన ప్రేక్షకులను అలరించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు