OTT: 50 రోజుల తర్వాతే ఓటీటీలోకి సినిమాలు.. నిర్మాతల కీలక నిర్ణయం

ఓటీటీలో కొత్త సినిమాల విడుదలపై తెలుగు చలన చిత్ర నిర్మాతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. థియేటర్లలో విడుదలైన చిత్రాలను 50 రోజుల తర్వాతే ఓటీటీకి ఇచ్చేలా ప్రణాళికలు రచించారు.

Updated : 29 Jun 2022 19:55 IST

హైదరాబాద్‌: ఓటీటీలో కొత్త సినిమాల విడుదలపై తెలుగు చలన చిత్ర నిర్మాతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. థియేటర్లలో విడుదలైన 50 రోజుల తర్వాతే సినిమాలను ఓటీటీకి ఇచ్చేలా ఓ నిర్ణయానికి వచ్చారు. జులై 1 నుంచి ఒప్పందాలు చేసుకునే సినిమాలకు ఈ నిబంధన వర్తించనుంది. భారీ బడ్జెట్‌ చిత్రాల నుంచి చిన్న సినిమాల వరకు అన్నీ విడుదలైన కొన్ని రోజులకే ఓటీటీలోకి వస్తుండటం థియేటర్ల వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని పలువురు నిర్మాతలు వాపోయారు. అలాగే హీరోల క్రేజ్‌ తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై చర్చలు జరిపిన నిర్మాతలు బుధవారం సమావేశమయ్యారు. దీంతో తెలుగు సినిమాలు ఇకపై థియేటర్‌లోకి వచ్చిన 50 రోజుల తర్వాతే ఓటీటీల్లోకి వస్తాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని