Ravi Teja: తొలి వేటకు టైగర్‌

‘టైగర్‌ నాగేశ్వరరావు’గా అలరించేందుకు సెట్స్‌పై శరవేగంగా ముస్తాబవుతున్నారు రవితేజ. ఆయన టైటిల్‌ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని వంశీ తెరకెక్కిస్తున్నారు.

Updated : 13 Jan 2023 08:35 IST

‘టైగర్‌ నాగేశ్వరరావు’గా (Tiger Nageswara Rao) అలరించేందుకు సెట్స్‌పై శరవేగంగా ముస్తాబవుతున్నారు రవితేజ (Raviteja). ఆయన టైటిల్‌ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని వంశీ తెరకెక్కిస్తున్నారు. అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మిస్తున్నారు. నూపుర్‌ సనన్‌, గాయత్రి భరద్వాజ్‌ కథానాయికలు. రేణు దేశాయ్‌ కీలక పాత్రలో నటిస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా.. తాజాగా ఓ కీలక షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. ఇందులో భాగంగా రవితేజపై ఓ భారీ పోరాటఘట్టాన్ని చిత్రీకరించినట్లు చిత్ర బృందం సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించింది. త్వరలో ‘టైగర్‌ ఫస్ట్‌ హంట్‌’ పేరుతో తొలి ప్రచార చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. 1970 స్టువర్ట్‌పురం నేపథ్యంలో సాగే చిత్రమిది. ఆ కాలంలో పేరు మోసిన ఓ గజదొంగ జీవితకథతో దీన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: జి.వి.ప్రకాష్‌ కుమార్‌, ఛాయాగ్రహణం: ఆర్‌.మది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని