Updated : 18 May 2022 15:46 IST

KGF2: కేజీయఫ్‌-2 ‘తుపాన్‌..’ ఫుల్‌ వీడియో సాంగ్‌ చూశారా..

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో యశ్‌ నటించిన సినిమా ‘కేజీయఫ్‌2’. ఈ సినిమాలో యశ్‌కు జోడిగా శ్రీనిధి శెట్టి నటించింది. ఈ చిత్రంలోని ‘తుపాన్‌...’ అంటూ సాగే వీడియో సాంగ్‌ని చిత్రబృందం విడుదల చేసింది. ట్విట్టర్‌ వేదికగా లింక్‌ను షేర్‌ చేసింది. ఇప్పటికే ఈ సినిమాలోని తల్లి సెంటిమెంట్‌ సాంగ్, మెహబూబా వీడియో పాటలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన ఈ సినిమా బాక్స్ఆఫీసుల వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. సంజయ్‌ దత్‌, రవీనా టాండన్‌, ప్రకాశ్‌రాజ్‌, రావు రమేశ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాను హోంబాలే ఫిల్మ్స్‌ పతాకం పై విజయ్‌ కిరంగదూర్‌ నిర్మించారు.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని