kgf 2: కేజీయఫ్‌-2 నుంచి పవర్‌ఫుల్‌ లిరికల్‌ విడుదల

‘సుల్తానా’ అనే లిరికల్‌ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది.

Published : 13 Apr 2022 17:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్: కేజీయఫ్‌-2తో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్‌ చేయడానికి వస్తున్నాడు రాకీభాయ్‌. ఏప్రిల్‌ 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి ‘సుల్తానా’ అనే లిరికల్‌ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. మొదటి భాగంలోని ‘ధీర ధీర’ పాటకు ఇది కొనసాగింపులా కనిపిస్తోంది. రామజోగయ్య శాస్త్రి అందించిన పవర్‌ఫుల్‌ లిరిక్స్‌ సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తించేలా ఉన్నాయి. ‘రణ రణ రణ రణ ధీర గొడుగెత్తె నీల గగనాలు..’అంటూ మొదలయ్యే ఈ పాటకు రవి బస్రూర్‌ స్వరాలు సమకూర్చారు. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా కన్నడతో పాటుగా తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. ప్రశాంత్‌ నీల్ దర్శకత్వంలో కన్నడ స్టార్‌ నటుడు యశ్‌ నటిస్తున్న ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి కథానాయిక. విలన్‌ పాత్రలో బాలీవుడ్‌ హీరో సంజయ్‌ దత్‌ అధీరాగా కనిపించబోతున్నాడు. హోంబలే ఫిలిమ్స్‌ పతాకంపై విజయ్‌ కిరగందుర్‌ సినిమాను నిర్మించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని