KGF 2: రాకీభాయ్‌ హంగామా

విజయవంతమైన ‘కె.జి.ఎఫ్‌’కి కొనసాగింపుగా రూపొందిన చిత్రం ‘కె.జి.ఎఫ్‌ ఛాప్టర్‌ 2’. దేశవ్యాప్తంగా ప్రేక్షకులు అమితాసక్తితో ఎదురు చూస్తున్న సినిమాల్లో ఇదొకటి.  యశ్‌ కథానాయకుడిగా నటించారు. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్నారు. హోంబళే ఫిలింస్‌ పతాకంపై విజయ్‌ కిరగందూర్‌ నిర్మిస్తున్నారు. ఏప్రిల్‌ 14న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ట్రైలర్‌ విడుదల తేదీ ఖరారైంది. ఈ నెల 27న ట్రైలర్‌ని విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ఇందులో రాకీ భాయ్‌గా సందడి

Updated : 04 Mar 2022 09:23 IST

విజయవంతమైన ‘కె.జి.ఎఫ్‌’కి కొనసాగింపుగా రూపొందిన చిత్రం ‘కె.జి.ఎఫ్‌ ఛాప్టర్‌ 2’. దేశవ్యాప్తంగా ప్రేక్షకులు అమితాసక్తితో ఎదురు చూస్తున్న సినిమాల్లో ఇదొకటి.  యశ్‌ కథానాయకుడిగా నటించారు. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్నారు. హోంబళే ఫిలింస్‌ పతాకంపై విజయ్‌ కిరగందూర్‌ నిర్మిస్తున్నారు. ఏప్రిల్‌ 14న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ట్రైలర్‌ విడుదల తేదీ ఖరారైంది. ఈ నెల 27న ట్రైలర్‌ని విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ఇందులో రాకీ భాయ్‌గా సందడి చేయనున్నారు యశ్‌. సంజయ్‌దత్‌, రవీనాటాండన్‌, ప్రకాష్‌రాజ్‌, శ్రీనిధి  శెట్టి కీలకపాత్రలు పోషించారు. కన్నడతోపాటు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని