KGF2: రక్తంతో రాసిన కథ

‘‘నాకెవ్వడి దోస్తీ అక్కర్లేదు, నాతో దుష్మనీ ఎవ్వడూ తట్టుకోలేడు’’ అంటున్నాడు రాకీభాయ్‌. ఆ కథేమిటో తెలియాలంటే ‘కె.జి.ఎఫ్‌ ఛాప్టర్‌ 2’ చూడాల్సిందే. యశ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. విజయవంతమైన ‘కె.జి.ఎఫ్‌ ఛాప్టర్‌ 1’కి కొనసాగింపుగా రూపొందింది.

Updated : 28 Mar 2022 09:43 IST

‘‘నాకెవ్వడి దోస్తీ అక్కర్లేదు, నాతో దుష్మనీ ఎవ్వడూ తట్టుకోలేడు’’ అంటున్నాడు రాకీభాయ్‌. ఆ కథేమిటో తెలియాలంటే ‘కె.జి.ఎఫ్‌ ఛాప్టర్‌ 2’ చూడాల్సిందే. యశ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. విజయవంతమైన ‘కె.జి.ఎఫ్‌ ఛాప్టర్‌ 1’కి కొనసాగింపుగా రూపొందింది. ప్రశాంత్‌ నీల్‌ దర్శకుడు. హోంబలే ఫిలింస్‌ నిర్మిస్తోంది. శ్రీనిధి శెట్టి కథానాయిక. ఏప్రిల్‌ 14న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ని ఆదివారం సామాజిక మాధ్యమాల ద్వారా రామ్‌ చరణ్‌ విడుదల చేశారు. కేజీఎఫ్‌లో గరుడని చంపేసిన తర్వాత ఏం జరిగింది? అంటూ  మొదలయ్యే ఈ ట్రైలర్‌... ‘రక్తంతో రాసిన కథ ఇది. సిరాతో ముందుకు తీసుకెళ్లాం. ముందుకెళ్లాంటే మళ్లీ రక్తాన్నే అడుగుతోంది’ అంటూ సాగుతోంది. ఇందులో విజువల్స్‌, పోరాట ఘట్టాలు, హీరోయిజం,  పాత్రల గెటప్పులు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ చిత్రంలో అధీరాగా సంజయ్‌దత్‌‘ నటించారు. రవీనా  టాండన్‌, రావు రమేశ్‌, ప్రకాష్‌రాజ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని