KGF: ‘కేజీయఫ్’ తాత ఇకలేరు
‘కేజీయఫ్’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు కృష్ణాజీ రావు కన్నుమూశారు.
బెంగళూరు: ‘కేజీయఫ్’ (KGF) తాతగా ప్రేక్షకుల మన్ననలు పొందిన నటుడు కృష్ణాజీ రావు (Krishan ji Rao) ఇకలేరు. అనారోగ్యంతో కొన్ని రోజుల క్రితం ఆస్పత్రిలో చేరిన ఆయన బుధవారం మరణించారు. వయసు రీత్యా వచ్చే సమస్యల కారణంగా ఆయన హాస్పిటల్లో చేరారని, చికిత్స పొందుతూనే కన్నుమూశారని శాండిల్‌వుడ్ వర్గాలు పేర్కొన్నాయి. కృష్ణాజీ మృతి పట్ల కన్నడ చలన చిత్ర ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
ఆంధ్రా- కర్ణాటక సరిహద్దుల్లోని ఓ గ్రామంలో పుట్టి, పెరిగిన కృష్ణాజీ సినిమారంగంలో అడుగుపెట్టాలని బెంగళూరుకు వెళ్లారు. ఎక్కడా అవకాశం లభించకపోవడంతో కొన్ని నెలలు జూనియర్ ఆర్టిస్ట్‌గా చేశారు. తర్వాత, పలువురు ప్రముఖుల దర్శకుల వద్ద అసిస్టెంట్, అసోసియేట్ డైరెక్టర్‌గా సుమారు 40 సినిమాలకు పనిచేశారు. దాదాపు 500 చిత్రాలకు సెన్సార్ స్క్రిప్టు రాశారు. ఓ మేనేజరు చెప్పగా ‘కేజీయఫ్’ సినిమా ఆడిషన్‌కు వెళ్లారు. తన ప్రతిభని నిరూపించుకొని ఆ సినిమాలోని అంధుడి పాత్రకు ఎంపికయ్యారు. యశ్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ఆయనది తక్కువ నిడివి ఉన్న పాత్రే అయినా మంచి ప్రభావం చూపింది. అందులో హీరో పవర్ గురించి ఆయన చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకులతో విజిల్స్ కొట్టించాయి. దీంతో కృష్ణాజీకి నటుడిగా వరుస అవకాశాలు వచ్చాయి. ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘నానో నారాయణప్ప’ విడుదలకు సిద్ధమవుతోంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Politics News
Ambati Rambabu: ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం లేదు: మంత్రి అంబటి
-
Crime News
Smita Sabharwal: పదోన్నతుల గురించి మాట్లాడేందుకే వెళ్లా.. స్మితా సభర్వాల్ ఇంట్లోకి చొరబడిన డీటీ వెల్లడి
-
World News
ఆక్సిటోసిన్ లవ్ హార్మోన్ కాదా?.. శాస్త్రవేత్తల పరిశోధనల్లో కీలక విషయాలు..
-
Politics News
Bachula Arjunudu: తెదేపా ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడికి తీవ్ర అస్వస్థత
-
Politics News
Andhra News: ప్రభుత్వ ఉద్యోగివా.. వైకాపా కార్యకర్తవా?