KGF Chapter 2: ‘బాహుబలి2’ రికార్డును బద్దలు కొట్టిన ‘కేజీయఫ్‌2’

బాక్సాఫీస్‌ వద్ద రాఖీభాయ్‌ రికార్డుల వేట కొనసాగుతోంది. తొలి భాగం కేజీయఫ్‌-1 ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల వసూళ్లు సాధించగా

Published : 31 May 2022 02:12 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బాక్సాఫీస్‌ వద్ద రాఖీభాయ్‌ రికార్డుల వేట కొనసాగుతోంది. తొలి భాగం కేజీయఫ్‌-1 ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల వసూళ్లు సాధించగా, ఇప్పుడు కేజీయఫ్‌2 దానికి ఆరు రెట్లు వసూళ్లు సాధించి రికార్డులు బద్దలుకొట్టింది. దీంతో పాటు, మరొ రికార్డును కూడా అధిగమించింది. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్‌, రానా, అనుష్క కీలక పాత్రల్లో నటించిన ‘బాహుబలి2’ పేరిట ఉన్న రికార్డును దాటేసింది.  ఇప్పటికీ చాలా చోట్ల ‘కేజీయఫ్‌2’ హవా నడుస్తోంది. ముఖ్యంగా ఉత్తరాది ప్రేక్షకులు రాఖీభాయ్‌ యాక్షన్‌కు ఫిదా అవుతున్నారు.

తాజాగా రికార్డు ఏంటంటే, సినిమా టికెట్‌ అగ్రిగేటర్‌ ‘బుక్‌మై షో’లో ‘కేజీయఫ్‌2’ సినిమాకు సంబంధించి 17.1 మిలియన్‌ టికెట్లు అమ్ముడయ్యాయి. ఇప్పటివరకూ ‘బాహుబలి2’ పేరుతో ఉన్న రికార్డు బద్దలైంది. అయితే, కలెక్షన్ల విషయంలో మాత్రం ఆ సినిమాను దాటలేకపోయింది. ఇప్పటివరకూ ఈ సినిమా రూ.1200కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. యశ్‌ కథానాయకుడిగా ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించిన ఈ సినిమాలో సంజయ్‌ దత్‌, రవీనా టాండన్‌, ప్రకాశ్‌రాజ్‌ కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా అద్దె ప్రాతిపదికన ఈ సినిమా అందుబాటులో ఉంది. రూ.199 చెల్లించి ప్రైమ్‌, నాన్‌ ప్రైమ్‌ వినియోగదారులు ఈ సినిమాను వీక్షించవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని