KGF Chapter 2: ‘కేజీయఫ్‌ ఛాప్టర్‌ 2’.. ఛాయాగ్రాహకులు ఇంత కష్టపడ్డారా!

‘కేజీయఫ్‌ ఛాప్టర్‌ 2’ మేకింగ్‌ వీడియో. ఈ క్రేజీ ప్రాజెక్టు ఎలా తెరకెక్కిందో చూసేయండి...

Published : 29 Apr 2022 02:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘కేజీయఫ్‌ ఛాప్టర్‌ 2’.. సినీ ప్రియులందరి నోట ఇప్పుడిదే మాట వినిపిస్తోంది. కన్నడ పరిశ్రమలో రూపొందిన ఈ పాన్‌ ఇండియా చిత్రం అన్ని భాషల వారిని విశేషంగా ఆకట్టుకుంది. ఇందులోని ప్రతి ఫ్రేమ్‌ అద్భుతమనిపించింది. తెరపై కనిపించిన ఆ అద్భుతాన్ని సృష్టించేందుకు చిత్ర బృందం పడిన కష్టం అంతా ఇంతా కాదు. ఈ సినిమాలోని సెట్స్‌, వందలమంది నటులను కెమెరాలో బంధించేందుకు తామెంత కష్టపడ్డామో ఛాయాగ్రాయకుల బృందం చెప్పుకొచ్చింది.

‘‘ప్రశాంత్‌ నీల్‌- యశ్‌ కాంబినేషన్‌కు తిరుగులేదు. సినిమానే వారి ప్రపంచం. ఒక్కోసారి.. నిర్విరామంగా 12 గంటలు పనిచేసేవాళ్లం. 10 రోజులు అనుకున్న షెడ్యూల్‌ 8 రోజులకే ముగిసేది. నరాచీ నేపథ్యంలో వందల మంది కనిపించే సీన్లు, కార్ల బ్లాస్టింగ్‌ సన్నివేశాలను ఓ సవాలుగా స్వీకరించాం. సెట్స్‌లో అడుగుపెట్టిన తొలినాళ్లలో కొంచెం ఇబ్బంది అనిపించింది కానీ తర్వాతతర్వాత ఇష్టం పెరిగింది. ఈ చిత్రానికి పనిచేసిన ప్రతి టెక్నిషియన్‌ ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నారు. భారతీయ సినీ అభిమానులకు మంచి చిత్రాన్ని ఇవ్వాలని ప్రతి ఒక్కరం ఆసక్తిగా పనిచేశాం. ఈ ఐదేళ్ల ప్రయాణంలో ఎంతో ఆనందాన్ని పొందాం’’ అని డీవోపీ టీమ్‌ తెలిపింది. ప్రశాంత్‌ నీల్‌- యశ్‌ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘కేజీయఫ్‌ 1’కు కొనసాగింపుగా రూపొందిన ‘కేజీయఫ్‌ 2’ ఇప్పటి వరకూ రూ. 920 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. అతి త్వరలోనే రూ. 1000 కోట్లు వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో చేరబోతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బాలీవుడ్‌ నటులు సంజయ్‌ దత్‌, రవీనా టాండన్, ప్రకాశ్‌రాజ్‌, రావు రమేశ్‌ ఈ సీక్వెల్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రవి బస్రూర్‌ సంగీతం సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లింది. ‘కేజీయఫ్‌’ తెర వెనక ఏం జరిగిందో ఈ వీడియోలో చూసేయండి..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని