KGF Chapter2: హిందీ నేర్చుకుంటున్న యశ్‌.. బాలీవుడ్‌ మూవీ చేస్తారా?

భారతీయ సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న మరో యాక్షన్‌ చిత్రం ‘కేజీయఫ్‌: చాప్టర్‌-2’.

Published : 03 Apr 2022 17:11 IST

న్యూదిల్లీ: భారతీయ సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న మరో యాక్షన్‌ చిత్రం ‘కేజీయఫ్‌: చాప్టర్‌-2’. యశ్‌ కథానాయకుడిగా ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్‌ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా న్యూదిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కథానాయకుడు యశ్‌తో పాటు, ప్రశాంత్‌ నీల్‌, సంజయ్‌దత్‌, రవీనా టాండన్‌ తదితరులు పాల్గొన్నారు.  ప్రస్తుతం తాను హిందీ నేర్చుకుంటున్నట్లు యశ్‌ తెలిపారు. గతంతో పోలిస్తే చాలా మారిపోయిందని, ప్రజలు అభిమానిస్తేనే ఎవరైనా సూపర్‌స్టార్‌ అవుతారని అన్నారు. నేరుగా హిందీ సినిమా చేసే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ ప్రతి దాన్నీ సమదృష్టితో చూస్తానని, ఇది నా జీవితంలో అతిపెద్ద సినిమా అని అన్నారు.

కేజీయఫ్‌-1కు కొనసాగింపుగా కేజీయఫ్‌-2 ప్రేక్షకుల ముందుకు రానుంది. గరుడను చంపేసిన తర్వాత రాఖీ కేజీయఫ్‌ను ఎలా ఆక్రమించుకున్నాడు? అతడిని అడ్డుకునేందుకు అధీర ఏం చేశాడు? ప్రధాన మంత్రి రమీకాసేన్‌ తీసుకున్న నిర్ణయాలు ఏంటి? భారత్‌పై ఇనాయత్‌ దాడి చేశాడా? ఇలా ఎన్నో ఆసక్తికర ప్రశ్నలకు కేజీయఫ్‌-2లో సమాధానం లభించనుంది.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts