KGF Chapter 2 Trailer: ‘కేజీయఫ్‌- 2’ ట్రైలర్‌ ఆగయా.. ఛాప్టర్‌-1కు మించి!

‘కేజీయఫ్‌ ఛాప్టర్‌ 2’ ట్రైలర్‌. యశ్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించిన చిత్రమిది. ప్రచార చిత్రం ఎలా ఉందంటే...

Updated : 27 Mar 2022 19:18 IST

‘కేజీయఫ్‌ ఛాప్టర్‌-2’ సందడి షురూ అయింది. భారతీయ సినిమా అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ట్రైలర్‌ తాజాగా విడుదలైంది. తెలుగు ట్రైలర్‌ను ప్రముఖ నటుడు రామ్‌ చరణ్‌ సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేశారు. తొలిభాగం ఛాప్టర్‌-1కు మించి ఛాప్టర్‌- 2 రూపొందినట్టు ట్రైలర్‌ చూస్తుంటే అర్థమవుతోంది.

‘‘కేజీయఫ్‌’లో గరుడను చంపేసిన తర్వాత ఏం జరిగింది? మీరు చదువుతారా’ అనే సంభాషణతో ప్రారంభమై, ఆద్యంతం ప్రేక్షకుల్ని కట్టిపడేసేలా ఉంది ట్రైలర్‌. ‘హీ ఈజ్‌ ది బిగ్గెస్ట్‌ క్రిమినల్‌. హీ ఈజ్‌ ది బిగ్గెస్ట్‌ బిజినెస్‌మ్యాన్‌’ అనే పవర్‌ఫుల్‌ డైలాగ్‌ తర్వాత వచ్చే యశ్‌ ఎంట్రీ అదుర్స్‌ అనిపిస్తోంది. ‘నాకు ఎవ్వడి దోస్తీ అక్కర్లేదు.. నాతో దుష్మని ఎవ్వడూ తట్టుకోలేడు’ అని యశ్‌ చెప్పిన డైలాగ్స్‌ అభిమానులతో విజిల్స్‌ కొట్టించేలా ఉన్నాయి. ప్రకాశ్‌రాజ్‌, సంజయ్‌దత్‌, రవీనా టాండన్‌, రావు రమేశ్‌.. అందరి పాత్రలు చాలా పవర్‌ఫుల్‌గా తెరకెక్కినట్టు తెలుస్తోంది. రవి బస్రూర్‌ అందించిన నేపథ్య సంగీతం ప్రచార చిత్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్లేలా ఉంది. 

ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్‌ సంస్థ నిర్మించింది. యశ్‌ సరసన శ్రీనిధి శెట్టి సందడి చేయనుంది. ‘కేజీయఫ్‌- 1’ అనూహ్య విజయం అందుకోవడంతో అన్ని చిత్ర పరిశ్రమల్లోనూ ‘కేజీయఫ్‌-2’పై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ పాన్‌ ఇండియా చిత్రం ఏప్రిల్‌ 14న విడుదల కానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని