KGF Chapter 2: ‘కేజీయఫ్‌2’ విడుదలపై మరోసారి స్పష్టతనిచ్చిన చిత్ర బృందం

రాఖీభాయ్‌ ప్రేక్షకులను అలరించే విషయంలో ఎలాంటి మార్పూ లేదు. ‘కేజీయఫ్: చాప్టర్‌-2‌’(KGF Chapter 2) అనుకున్న తేదీకే

Published : 22 Feb 2022 01:35 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రాఖీభాయ్‌ ప్రేక్షకులను అలరించే విషయంలో ఎలాంటి మార్పూ లేదు. ‘కేజీయఫ్: చాప్టర్‌-2‌’(KGF Chapter 2) అనుకున్న తేదీకే విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది. యశ్‌(Yash) కథానాయకుడిగా ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘కేజీయఫ్‌’. ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘కేజీయఫ్‌2’ ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఎప్పుడో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమాను ఎట్టకేలకు ఏప్రిల్‌ 14న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో కొన్ని వార్తలు సామాజిక మాధ్యమాల వేదికగా చక్కర్లు కొట్టాయి. ‘కేజీయఫ్‌2’లో యశ్‌ ఇంట్రో సాంగ్‌ అనుకున్న స్థాయిలో రాలేదని మళ్లీ షూట్‌ చేస్తున్నారని టాక్‌ వినిపించింది. దీంతో సినిమా విడుదల ఆలస్యమంటూ వార్తలు వచ్చాయి. కానీ, వాటన్నింటినీ చిత్ర బృందం కొట్టిపారేసింది. ‘ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్‌ 14న థియేటర్‌లలో రైజ్‌ ఆఫ్‌ రాకీని చూస్తారు’ అని పేర్కొంది. తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీతో పాటు ఇంగ్లీష్‌లోనూ ఈ సినిమాను విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి యశ్‌ కూడా తన డబ్బింగ్‌ను పూర్తి చేశారు. ఇతర భాషల్లోనూ డబ్బింగ్‌ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts