KGF: తెలుగు వారి అభిమానం మాటలకందనిది... యశ్‌

కేజీయఫ్‌ సినిమా ఎంతటి ప్రభంజనం సృష్టంచిందో అందరికీ తెలిసిందే. మరోసారి కేజీయఫ్‌-2 తో అలాంటి సంచలనానికి సిద్ధమైంది ఈ చిత్ర బృందం. ఈ సినిమా ఏప్రిల్‌ 14న ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా వైజాగ్‌లో సాగరతీరాన ప్రెస్‌మీట్‌ నిర్వహించారు.

Published : 11 Apr 2022 19:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కేజీయఫ్‌ సినిమా ఎంతటి ప్రభంజనం సృష్టంచిందో అందరికీ తెలిసిందే. మరోసారి కేజీయఫ్‌-2 తో అలాంటి సంచలనానికి సిద్ధమైంది ఈ చిత్ర బృందం. ఈ సినిమా ఏప్రిల్‌ 14న ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా వైజాగ్‌లో సాగరతీరాన ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. ‘అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు. బాగున్నారా’. అంటూ తెలుగులో పలకరిస్తూ మాట్లాడారు కన్నడ స్టార్‌ యశ్‌. వైజాగ్‌ తనకెంతో నచ్చిందంటూ, ఇంతలా ప్రేమ చూపిస్తున్నందుకు అందరికీ కృతజ్ఞతలు అని తెలిపారు. తెలుగు ప్రేక్షకుల అభిమానం మాటలకందనిదన్నారు. అందరూ కుటుంబంతో కలిసి చూసేలా మంచి సినిమా తీశామని చెప్పారు. తెలుగు బాగా మాట్లాడుతున్నారంటూ వచ్చిన కామెంట్‌కు స్పందిస్తూ ‘తెలుగు అభిమానులు ఇంత ప్రేమ చూపుతున్నారు. వారి కోసం నేర్చుకుంటున్నాను. అది నా బాధ్యత’ అంటూ బదులిచ్చారు. కథ బాగుంటే మల్టీ స్టారర్‌లో నటించడానికైనా సిద్ధమంటూ మీడియాతో కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.

సినిమా టికెట్‌ ధరలు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు కదా.. ఏమైంది..?
యశ్‌: తప్పకుండా పెంచుతారనుకుంటున్నాను. మేము రెండు తెలుగు రాష్ట్రాల్లో షూటింగ్‌ చేశాం. ఈ సినిమాకు పనిచేసిన టెక్నిషియన్స్‌లో చాలా మంది ఇక్కడి వాళ్లున్నారు. ఎలా అయితే ప్రేక్షకులు సినిమాకు వచ్చి మాకు సపోర్టు చేస్తున్నారో.. ప్రభుత్వం కూడా టికెట్‌ ధరలు పెంచి మాకు సహకరిస్తుంది. అయితే.. ధరల పెంపు విషయంలో ఇంకా అధికారికంగా ప్రకటన రాలేదు.

కేజీయఫ్‌, కేజీయఫ్‌-2కు చాలా తేడా ఉంది. ఇందులో బాలీవుడ్‌ నటీనటులు ఉన్నారు. వాళ్లతో కలిసి నటించడం ఎలా ఉంది. మీరు భవిష్యత్తులో బాలీవుడ్‌లో నటించే అవకాశం ఉందా?
యశ్‌: ఏ భాషలో నటిస్తున్నామన్నది ముఖ్యం కాదు. ఈ సినిమాలో అన్ని భాషలకు చెందిన ప్రముఖ నటీనటులు ఉన్నారు. వాళ్లందరితో కలిసి నటించడం నాకు చాలా ఆనందంగా ఉంది. 

మీ తర్వాత సినిమాలు ఏంటి? అవి కూడా కేజీయఫ్‌ తరహా కథలేనా? 
యశ్‌: ఏ సినిమా చేసినా అది అందరి కృషి. నా ఒక్కడిది కాదు. ఏదైనా మంచి సినిమా వస్తే ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారన్నది నా నమ్మకం. తర్వాత సినిమా కథను ఎంచుకునే ముందు నా అభిమానులను దృష్టిలో ఉంచుకునే ఎంపిక చేసుకుంటాను. 

కేజీయఫ్‌2 సక్సెస్‌మీట్‌ కూడా వైజాగ్‌లోనే ఏర్పాటుచేస్తారా?
యశ్‌: నాకు వ్యక్తిగతంగా వైజాగ్‌ రావడం చాలా ఇష్టం. సక్సెస్‌మీట్‌ ఇక్కడ ఉంటుందా.. మరో ప్రాంతంలోనా? అన్నది నా చేతిలో లేదు.

కేజీయఫ్‌ని రెండు భాగాలుగా తీయాలని ముందే నిర్ణయించారా? 
యశ్‌: లేదు. మెదటి భాగం షూటింగ్‌ సమయంలో నిర్ణయించుకున్నాం. ఛాప్టర్‌-1లో చాలా మార్పులు చేశాం. రెండో ఛాప్టర్‌ కథ ముందే సిద్ధం చేశాం.  

కేజీయఫ్‌ మీలో ఎలాంటి మార్పు తీసుకువచ్చింది.
యశ్‌: చాలా మార్పులు వచ్చాయి. నేను మీతో ఇలా తెలుగులో మాట్లాడుతున్నాను కదా.. ఇది ఆ మార్పుల్లో భాగమే(నవ్వుతూ).

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts