- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
KGF Avinash: కేజీయఫ్ విలన్‌కు రోడ్డు ప్రమాదం... మీ ప్రేమ వల్ల బతికా: అవినాశ్
బెంగళూరు: ‘కేజీయఫ్’ (KGF) సిరీస్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన కన్నడ నటుడు బి.ఎస్. అవినాష్ (BS Avinash). ఇటీవల ఆయన రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. తన క్షేమం కోరిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ‘‘బుధవారం ఉదయం 6: 05 గం.ల సమయంలో నా జీవితంలో ఎప్పుడూలేని భయాన్ని చూశా. ఊహించలేని ఘటన ఇది. సెకన్ల వ్యవధిలో అంతా తారుమారైనట్టుంది. అనిల్ కుంబ్లే కూడలి వైపు వెళ్తుండగా రెడ్ సిగ్నల్ క్రాస్ చేసిన ఓ కంటైనర్ నా కారును ఢీ కొట్టింది. కారు ధ్వంసమైంది కానీ, మీ ప్రేమాభిమానాల వల్ల నాకు ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటన నుంచి తేరుకునేలా నాకు సహకరించిన కుటుంబ సభ్యులు, స్నేహితులు, పోలీసు, ఆర్టీవో అధికారులు, ‘సుందరం మోటార్స్’ మిత్రులందరికీ ధన్యవాదాలు. మీ ఆశీస్సుల వల్లే నేనిలా ఉన్నాను’’ అని అవినాష్ భావోద్వేగానికి గురయ్యారు.
విలాసవంతమైన ఆ కారును అవినాషే నడిపారు. ఆ సమయంలో ఆయన జిమ్‌కు వెళ్తున్నారు. రెడ్ సిగ్నల్‌ను పట్టించుకోకుండా కంటైనర్ డ్రైవరు ముందుకు వచ్చినట్లు సీసీ కెమెరా ఫుటేజ్‌లో గుర్తించారు. కంటెయినర్ డ్రైవరు శివనగౌడను కబ్బన్‌పార్కు ట్రాఫిక్ పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం ఈ ఘటన చోటుచేసుకోగా గురువారం వెలుగులోకి వచ్చింది. యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం ‘కేజీయఫ్ 1’, ‘కేజీయఫ్ 2’లో ఆండ్రూస్ అనే పాత్ర పోషించారు అవినాష్.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Anand Mahindra: వాసుకిని మెచ్చుకున్న ఆనంద్ మహీంద్రా..!
-
General News
Andhra News: యాప్ వివాదం.. ఉపాధ్యాయ సంఘాలతో మంత్రి బొత్స చర్చలు విఫలం
-
Movies News
OTT Movies: 8వారాల తర్వాతే ఓటీటీలో సినిమా: దిల్‌రాజు
-
Politics News
Munugode: మునుగోడు ఉప ఎన్నిక ఇన్‌ఛార్జి కోసం భాజపా నేతల మధ్య పోటీ
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Sports News
Virat Kohli: విరాట్ కోహ్లీ @ 14 ఇయర్స్.. అందరూ ఉన్నా ఒంటరిగా ఫీలయ్యా!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Vinod kambli: బీసీసీఐ పింఛనే నాకు దిక్కు.. సచిన్ నుంచి ఏమీ ఆశించట్లేదు: వినోద్ కాంబ్లి
- DK : ఆయన ఓటమిని అస్సలు తట్టుకోలేడు.. సహనం తక్కువే.. కానీ!
- Andhra News: వివాహితను భయపెట్టి నగ్న వీడియో కాల్..
- Liger: లైగర్ ఓటీటీ ఆఫర్ ఎందుకు వదులుకున్నారు?
- Madhavan: ‘రాకెట్రీ.. మాధవన్ ఇంటిని కోల్పోయాడు’
- అజిత్ డోభాల్ ఇంటి వద్ద వ్యక్తి హల్చల్ ఘటన.. ముగ్గురు కమాండోలపై వేటు
- Vizag: విశాఖలో రౌడీషీటర్ హత్య.. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఘాతుకం
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (18/08/2022)
- Thiru review: రివ్యూ: తిరు
- Viral video: యూనిఫాంలో పోలీసుల ‘నాగిని డ్యాన్స్’.. వైరల్‌గా మారిన వీడియో