KGF: ‘వైలెన్స్‌.. వైలెన్స్‌..’ డైలాగ్‌ పై స్పందించిన యశ్‌... ఏమన్నారంటే..

దేశవ్యాప్తంగా కేజీయఫ్‌ సృష్టంచిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

Published : 24 Apr 2022 01:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశవ్యాప్తంగా ‘కేజీయఫ్‌2’ సృష్టంచిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సినిమా విజయంతో ఆనందంలో ఉన్న యశ్‌ ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను చెప్పారు. సినిమా ట్రైలర్‌, టీజర్‌కు వచ్చిన స్పందన చూసి హిట్‌ అవుతుందని ఊహించానన్నారు. ఇక ఈ సినిమాలోని ‘వైలెన్స్‌.. వైలెన్స్‌.. వైలెన్స్‌..’ డైలాగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ డైలాగ్‌పై యశ్‌ మాట్లాడుతూ.. ‘నా వరకు ఇది ఒక హాస్యాస్పదమైన డైలాగ్‌. ఆ డైలాగ్‌లో ‘రాఖీ’ చాలా కూల్‌గా  ఉన్నట్లు కనిపించడానికి ప్రయత్నిస్తాడు. ఒక సినిమా తీసేటప్పుడు జనం థియేటర్లకు ఎందుకు వస్తారో అర్థం చేసుకోవాలి. వాళ్ల అంచనాలకు తగ్గట్టు సినిమా ఉండాలి. వాళ్లకి వినోదం అవసరం. అన్ని సన్నివేశాలు సీరియస్‌గా ఉంటే అది సినిమా అనిపించుకోదు. చాలా మంది విద్యార్థులు వాళ్ల పరీక్షలకు ఈ డైలాగ్‌ను అపాదించుకుంటున్నారు. ఇది మా అంచనాలకు మించినది’ అని అన్నారు. యశ్‌, శ్రీనిధి శెట్టి నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్‌ 14న విడుదలై ఇప్పటి వరకు రూ.750కోట్లకు పైగా వసూళ్లు చేసింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని